Advertisementt

ఇలియానా.. అంతొద్దు..!!

Sat 07th Oct 2017 04:14 PM
ileana,pokiri,mahesh babu,ileana comments on mahesh,baadshaho  ఇలియానా.. అంతొద్దు..!!
Ileana Sensational Comments on Mahesh Babu ఇలియానా.. అంతొద్దు..!!
Advertisement
Ads by CJ

సౌత్ లో ఇలియానా ఒక రేంజ్ లో స్టార్ స్టేటస్ అనుభవించింది. దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన ఇలియానా బాలీవుడ్ మీద మోజుతో అక్కడికి ఫ్లైట్ ఎక్కేసింది. ఇక బాలీవుడ్ లో కాలు పెట్టింది మొదలు అక్కడే తిష్ట వేసేద్దామని ప్లాన్స్ వేసి వేసి కుదరక అప్పుడప్పుడు సౌత్ లో కాలు పెడుతూనే వుంది. అయితే మళ్ళీ బాలీవుడ్ లో కాస్త బిజీ అవ్వగానే సౌత్ ని చిన్నచూపు చూడడం మొదలెట్టేసింది. అసలు దక్షిణాదిన నటించాలి అంటే దర్శక నిర్మాతలు చెప్పింది చెయ్యాలి అంటే... అందాల ఆరబోతకు సై అనాలి అంటూ ఆ మధ్యన రచ్చ చేసింది.

మళ్ళీ ఇప్పుడు తాజాగా తనకు 'పోకిరి' సినిమా కన్నా ముందు అసలు మహేష్ బాబు ఎవరో కూడా తెలియదంటూ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంది. మరి ఈ రకమయిన స్టేట్మెంట్ తో ఇలియానా మరోసారి హైలెట్ అయ్యింది. ఇలియానా బాలీవుడ్ లో నటించిన బాద్‌షాహో సినిమా విజయోత్సాహంలో కొట్టుకుపోతున్న ఇలియానా ముంబై లో ఒక ప్రవేట్ కార్యక్రమానికి హాజరయ్యింది. అక్కడ ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలియానా తనకి 16  ఏళ్లకే స్టార్ స్టేటస్ వచ్చేసిందని... అసలు తనకు సినిమాల్లో వచ్చి నటించాలని ఉండేది కాదని... తాను ఎప్పుడూ ఎయిర్ హోస్టెస్ అవ్వాలని కలలు కనేదానిని అని చెప్పుకొచ్చింది.

ఇక పోకిరికి ముందు తనకు సినిమా ఇండస్ట్రీ గురించి ఏమి తెలియదని.. అలాగే మహేష్ అంటే కూడా ఎవరో తెలియదని చెప్పి షాక్ ఇచ్చింది. మరి ఇలియానా ఇదంతా ఎందుకోసం చేస్తుంది అంటే కేవలం తనకి ఫ్రీ పబ్లిసిటీ కోసమే అంటూ కొందరు సెటైర్స్ వేస్తున్నారు. ఎందుకంటే పోకిరి సినిమాలో మహేష్ తో నటించి సూపర్ హిట్ కొట్టిన ఈ భామకి ఆ సినిమాకన్నా ముందు మహేష్ తెలియదు అంటే కాస్త కామెడీగా ఉందని... అసలు ఇలియానాకి ఇంత ఓవర్ అవసరమా అంటూ సెటైర్స్ వేస్తున్నారు.

Ileana Sensational Comments on Mahesh Babu:

Ileana's Controversial Comments On Tollywood Super Star Mahesh Babu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ