Advertisementt

'రాజా ది గ్రేట్' ట్రైలర్ - ఎనర్జీ ఫుల్.. !

Sat 07th Oct 2017 03:11 PM
raja the great,ravi teja,raja the great trailer review,anil ravipudi  'రాజా ది గ్రేట్' ట్రైలర్ - ఎనర్జీ ఫుల్.. !
Raja The Great Trailer Review 'రాజా ది గ్రేట్' ట్రైలర్ - ఎనర్జీ ఫుల్.. !
Advertisement
Ads by CJ

రవితేజ చాలా గ్యాప్ తీసుకుని పట్టాలెక్కించిన  చిత్రం రాజా ది గ్రేట్. పటాస్, సుప్రీమ్ చిత్రాల దర్శకుడు  అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే దివాళీ కానుకగా విడుదల కాబోతుంది. రవితేజ భారీ గ్యాప్ తీసుకుని అంధుడిగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అలాగే రవితేజ సరసన రెండు సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న మెహ్రీన్ కౌర్ నటిస్తుంది. ఈ చిత్రం పబ్లిసిటీ కార్యక్రమాల్లో భాగంగా ప్రేక్షకుల్లో ఇంకా భారీ అంచనాలు పెంచడానికి చిత్ర బృందం 'రాజా ది గ్రేట్' ట్రైలర్ ని విడుదల చేసింది.ఈ థియేట్రికల్ ట్రైలర్ లోను టీజర్ లో చూపినట్టే రవితేజ అంధుడిగా ఫుల్ ఎనర్జీగా పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నాడు. 

చాలా డేరింగ్ అండ్ డాషింగ్ గా వున్న రవితేజ ఒక అమ్మాయిని కాపాడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడో... అన్నదే రాజ్ ది గ్రేట్ కథగా అర్ధమయినప్పటికీ... రవితేజ తల్లి పాత్రలో రాధిక పోలీస్ కానిస్టేబుల్ గా కామెడీగా కనబడుతుంది. అలాగే హీరోయిన్ మెహ్రీన్ కౌర్ కూడా ఇంతకుముందు నటించిన రెండు సినిమాల్లో క్యూట్ లుక్స్ తో ఇరగదీసినప్పటికీ... ఈ సినిమాలో కాస్త సీరియస్ గానే ఉండబోతోందని ట్రైలర్  చూస్తుంటే తెలుస్తోంది. ఇక రవితేజ ఈ సినిమాలో డాన్స్ ల్లోనూ, యాక్షన్స్ లోను కొత్తగా ట్రై చేసినట్లు కనబడుతోంది. రవితేజ డాన్స్ కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అలాగే రవితేజ మార్క్ డైలాగ్ డెలివరీ కూడా ఆకట్టుకునేలా వుంది. అయితే రవితేజ మోహంలో ఇదివరకటి కళ లేదు కానీ.... ఇదివరకటి ఎనర్జీ లెవెల్స్ ఏమాత్రం తగ్గలేదు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి టేకింగ్ ఈ సినిమాకి మేజర్ అసెట్ కానుంది. రాజా ది గ్రేట్ నిర్మాత  దిల్ రాజు కూడా ఎటువంటి ఆలోచనలు లేకుండా ఈ సినిమాని నిర్మించినట్లుగా ట్రైలర్ లో అర్ధమవుతోంది. 

Click Here to See The Trailer

Raja The Great Trailer Review:

Ravi Teja Raja The Great Movie Trailer Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ