రకుల్‌ప్రీత్‌సింగ్.. ఈమద్య ఈ అమ్మడు ఊపు కాస్త తగ్గింది. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న ఈవిడ 'రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయకా' చిత్రాలు బాగానే ఆడాయి. కానీ ఆమె మొదటగా మహేష్ సరసన నటించాల్సిన చిత్రం 'బ్రహ్మోత్సవం'. కానీ డేట్స్ ప్ల్రాబ్లం వల్ల ఆమె ఆ పాత్రను వదులుకుంది. దాంతో ముగ్గురు హీరోయిన్లతో రూపొందిన ఈచిత్రంలో ఆ పాత్రకు కాజల్ అగర్వాల్‌ని పెట్టుకున్నారు. ఇక తాజాగా ఏకంగా మరుగదాస్ మూవీలో మహేష్ సరసన భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన 'స్పైడర్' లో అవకాశం సాధించింది.
ఈచిత్రంతో ఈమె మహేష్‌కి ఐరన్‌లెగ్‌గా మారిందని, ఆమె నటిస్తేనే కాదు.. ఏ మహేష్ సినిమాకైనా సరే ఆమె పేరును తల్చుకున్నా శని దేవత షూటింగ్ రోజే వచ్చి నెత్తి మీద కూర్చుంటుందని అంటున్నారు. కాగా మహేష్‌బాబు మాత్రం మరోసారి ఆమెతోనే చేయనున్నాడా? అంటే అవుననే అంటున్నారు. త్వరలో దిల్‌రాజు, అశ్వనీదత్‌ల కాంబినేషన్‌లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. మొదటి నుంచి ఈచిత్రంలో దిల్‌రాజు బేనర్ అయిన 'డిజె' (దువ్వాడజగన్నాథం)లో నటించిన పూజాహెగ్డే నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా రకుల్‌ప్రీత్‌సింగ్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో మహేష్ అభిమానులు భయపడిపోతున్నారు. కానీ ఓ చిత్రం గెలుపు, ఓటములకు మహేష్ తనని తాను నిందించుకుంటాడే గానీ ఆయన ఎవ్వరిపైనా నిందను తోయడు. దాంతో మహేష్ దర్శకనిర్మాతలు ఓకే అంటే తాను కూడా ఓకే అనేసే అవకాశాలే ఉన్నాయి.
మరి ఈ శనిదేవత పూజాహెగ్డేతో పాటు ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారా? లేక రకుల్‌ప్రీత్‌సింగ్ ఒక్కత్తే హీరోయినా? అనేది ఇంకా తేలడం లేదు. ఈ చిత్రం జనవరి నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా ప్రస్తుతం మహేష్ కైరా అద్వానీతో 'శ్రీమంతుడు' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దానయ్య నిర్మాతగా 'భరత్ అనే నేను' చిత్రంతో బిజీగా ఉన్నాడు. రకుల్ మాత్రం తెలుగులో కూడా మార్కెట్ ఉన్న తమిళ హీరోల సరసన జోడీలు కడుతోంది.