బాహుబలి మ్యానియా ఇంకా కొనసాగుతూనే వుంది. బాహుబలి థియేటర్స్ సందడి అలా ముగిసిందో లేదో ఇలా ఛానల్ లో బాహుబలి సందడి షురూ అయ్యింది. స్టార్ మా ఛానల్ లో వరల్డ్ ప్రీమియర్ గా ఎల్లుండి అంటే... ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రసారం కాబోతుంది. ఈ సందర్భంగా ప్రభాస్ ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాహుబలి విషయాలతో పాటు... తన తాజా చిత్రం సాహో గురించిన విశేషాలు కూడా ముచ్చటించాడు. బాహుబలి తర్వాత పలు భాషల్లో తెరకెక్కుతున్న సాహో చిత్రం కేవలం యాక్షన్ ఎంటెర్టైనెర్ గానే కాకుండా రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంటుందని చెబుతున్నాడు.
సాహోలో యాక్షన్ తోపాటు వీరలెవల్లో రొమాన్స్ కూడా ఉంటుందని... అందుకే ఏరికోరి బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ ని ఎందుకు తీసుకున్నామో సాహో చిత్రం చూశాక మీకే అర్ధమవుతుందంటున్నాడు డార్లింగ్ ప్రభాస్. శ్రద్ద కపూర్ కి మధ్యన ఘాటైన రొమాన్స్ ఉండబోతుందని... కూడా సిగ్గుపడుతూనే ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అంటే సాహో చిత్రం యాక్షన్ కమ్ రొమాంటిక్ ఎంటెర్టైనెర్ అన్నమాట. ఇక సాహో షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరప్రాంతాల్లో జరుగుతుంది. ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా.... యువి క్రియేషన్స్ వారు 250 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మిస్తున్నారు.