ఇటీవల సినిమాల గురించి సోషల్ మీడియాలో వచ్చే సినీ రివ్యూల గురించి పెద్ద చర్చే నడుస్తోంది. ఈ విషయంలో మాత్రం దాదాపు అందరు సమీక్షకులు అవి జర్నలిస్ట్‌ల హక్కుగా భావిస్తున్నారు. ఇలాంటి రివ్యూల వల్ల చెత్త చిత్రాలు మరింత చెత్తగా, కలెక్షన్లు లేకపడిపోతాయి. అదే మంచి చిత్రానికి మంచి రివ్యూ ఇస్తే ఆ సినిమా మరింత బలం చేకూరుతుంది. ఇదే విశ్లేషకులందరి ఒకేమాట. అయితే సోషల్‌మీడియాలో మరో రకం ఉంది. వెబ్‌సైట్ నిర్వాహకులు ఎక్కడో కూర్చుని గాసిప్స్ రాయడం, హీరోయిన్ల గురించి వెకిలిగా రాస్తు, సినిమాల పైరసీలను చూపించే వారు కూడా ఉన్నారు.
ఇక కొందరైతే అమాయక ఆడపిల్లల ఫొటోలను మార్ఫింగ్‌లు చేసి వారు ప్రాణాలు తీసుకునేంత ద్రోహానికి పాల్పడుతున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా సహించరానిది. దీనిపై మాత్రం నియంత్రణ ఉండాల్సిందే. తమ భార్యాపిల్లలను పోషించుకోవడానికి వెబ్‌సైట్స్ నడుపుతూ ఒకరికి ఇంకొక్కరితో ఎఫైర్లు ఉన్నాయని రాయడం, మార్ఫింగ్‌లు చేయడం వంటివి ఖచ్చితంగా ఖండించాల్సిందే. తెలుగు ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న నటి హేమ ఇదే విషయాన్ని లేవనెత్తడం హర్షించదగ్గ విషయం.
నటీనటులపై వస్తున్న గాసిప్స్ విషయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హేమ మాట్లాడుతూ, ఒళ్లు కొవ్వొక్కింది వారికి? ఇటువంటి రాతలు రాస్తున్నారు. ఏదైనా చదువుకోవడానికి అవసరమై ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తే దాని పక్కన ఇది క్లిక్ చేయండి అని ఓ బూతు, అశ్లీల రాతలు, ఫొటోలు ఉంటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
నిజమే.. ఇదే భయంతో తమ పిల్లలకు అసలు ఇంటర్నెట్ ఇవ్వడానికి సైతం పెద్దలు భయపడిపోతున్నారు. వారు ఏదో టైప్ చేసి స్క్రీన్ మీద మరేదో కనిపిస్తే అటు ఇటు తెలియని పిల్లలు పూర్తిగా చెడిపోయే ప్రమాదం ఉంది. దీనిపై హేమ స్పందనను మెచ్చుకోకుండా ఉండలేం. ఇలాంటి వాటిపై గూగుల్ సంస్థ దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.
👉 సురేఖవాణిపై, ఆమె కుమార్తెపై నటి హేమ సంచలన వ్యాఖ్యలు [Posted On 09-08-2022]