Advertisementt

మహానుభావుడుకే ఇది సాధ్యం..!

Fri 06th Oct 2017 02:58 PM
mahanubhavudu,100 more screens,sharwanand,maruti director  మహానుభావుడుకే ఇది సాధ్యం..!
100 More Screens for Mahanubhavudu మహానుభావుడుకే ఇది సాధ్యం..!
Advertisement
Ads by CJ

ఈ దసరా సెలవలని క్యాష్ చేసుకోవడానికి వరసబెట్టి రిలీజ్ అయిన మూడు సినిమాల్లో మహానుభావుడు క్లీన్ హిట్ గా నిలిచింది అని రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులతో పాటు ఓవర్సీస్ ప్రేక్షకులు చెబుతున్నమాట. మహేష్ బాబు నటించిన స్పైడర్‌ డిజాస్టర్‌ కాగా.... ఎన్టీఆర్ నటించిన  జై లవకుశ బ్రేక్‌ ఈవెన్‌ మార్కు చేరుకోవడం కోసం ఇంకా తంటాలు పడుతోంది. కాని ఈ రెండు బడా సినిమాలతో పోలిస్తే  మాత్రం చిన్న చిత్రంగా విడుదలైన మహానుభావుడు ఒక్కటే స్టడీ కలెక్షన్స్ తో సక్సెస్ వైపు దూసుకెళ్తుంది. ఇకపోతే ఈ వారంలో మహానుభావుడు సినిమా కోసం థియేటర్స్ ని పెంచే పనిలో ఉన్నారు డిస్ట్రిబ్యూటర్స్. 

మారుతీ - శర్వానంద్ కలయికలో వచ్చిన ఈ మహానుభావుడుకి రెండవ వారంలో కేవలం హైదరాబాద్‌లోనే 70 కి పైగా థియేటర్లు కేటాయించారు. ఒక చిన్న సినిమాకి రెండవ వారంలో ఇన్ని థియేటర్లు పెంచడం ఇదే తొలిసారి. మరి ఈ శుక్రవారం విడుదలయ్యే సినిమాల్లో ఇంట్రెస్ట్ కలిగించే సినిమాలు... పేరున్న హీరోల సినిమాలేమి లేకపోవడం కూడా శర్వా మహానుభావుడు కు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. మరి మహానుభావుడు ఊపుని క్యాష్‌ చేసుకోవడం కోసం థియేటర్లు పెంచి మరీ కలెక్షన్స్ పెంచేసుకుంటున్నారు బయ్యర్స్. 

మరి పండగ సెంటిమెంట్ తో హిట్స్ కొట్టుకుంటూ పోతున్న శర్వానంద్ మార్కెట్ మహానుభావుడుతో మరింతగా పెరిగిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక దర్శకుడు మారుతీ రేంజ్ కూడా మహానుభావుడుతో విపరీతంగా పెరిగింది. 

100 More Screens for Mahanubhavudu:

In spite of huge competition from two big films, Sharwanand's Mahanubhavudu hit the screens on 29th of September as a Dussehra gift for audience.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ