టాలీవుడ్ స్వీటెస్ట్ లవ్ బర్డ్స్ నాగ చైతన్య - సమంతలు మరొ కొన్ని గంటల్లోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. రేపు 6 వ తేదీ రాత్రి 11 గంటల 52 నిమిషాలకు గోవాలోని వెగ్టార్ బీచ్ లో ఉన్న డబ్య్లూ హోటల్ లో నాగ చైతన్య - సమంతల వివాహం హిందూ సంప్రదాయపద్ధతిలో జరగబోతుంది. ఇక పెళ్ళి కన్నా ముందు అంటే రేపు శుక్రవారం మధ్యాహాన్నం నుండి ఈ పెళ్లి వేడుకలు మొదలు కాబోతున్నాయి. ముందుగా మూడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు సమంత మెహిందీ వేడుక జరుపుకోనుంది. ఆ తరవాత అంటే 8.30 నిమిషాలకు డిన్నర్ స్టార్ట్ అయ్యి.... పెళ్లి సమయం అంటే దాదపు 10 గంటలకు ఈ డిన్నర్ పూర్తి చేసుకుని 11 గంటలకు పెళ్లి పట్టాలెక్కేస్తారు ఈ జంట. ఇక హిందూ సంప్రదాయపద్ధతి అంటే నాగ చైతన్య, సమంత నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టడంతోపాటు... తాళికట్టి సమంతని తన భార్యగా చేసుకుంటాడు.
ఇక ఈ పెళ్ళికి కేవలం అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు మాత్రమే హాజరవుతారని... అందులోని బంధువులంతా ఒక 100 మంది లోపే ఉంటారని తెలుస్తుంది. ఇక రేపు శుక్రవారం 6 వ తేదీన హిందూ సంప్రదాయపద్ధతి పెళ్లి పూర్తి కాగానే ఎల్లుండి అంటే.. శనివారం అక్టోబర్ 7వ తేదీన ఉదయం బ్రంచ్ అంటే టిఫిన్స్ తో స్టార్ట్ అయ్యి లంచ్ పూర్తయిన తర్వాత.... క్రిస్టియన్ సంప్రదాయంలో.... సాయంత్రం 5.30 నుంచి 6.30 మధ్యలో నాగ చైతన్య - సమంతల వివాహం క్రిస్టియన్ పద్ధతిలో జరుగుతుంది. ఇక తర్వాత అతిధులకు డిన్నర్ తో పాటు పార్టీ కూడా ఉంటుంది. మరి రెండు రకాల సంప్రదాయపద్ధతితో మనువాడబోతున్న ఈ జంట రిసెప్షన్ ని మాత్రం నాగార్జున అదిరిపోయే లెవల్లో హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించబోతున్నారు. ఇక ఈ వేడుక ఈ నెల 15 న ఉండొచ్చని నాగార్జున చెబుతున్నాడు.