నేటిరోజుల్లో యంగ్ హీరోలే దర్శకత్వంలో వేలుపెడుతున్నారు. ఇక మెగాస్టార్స్‌కి ఇది ఒక లెక్కా? అనేది బహిరంగ రహస్యమే. చిరంజీవి సినిమా డైరెక్షన్‌లో ఎంతలా వేలు పెడతాడనే దానికి సంగీత దర్శకుడు మణిశర్మనే ఆ మద్య ఓ ఉదాహరణ చెప్పాడు. 'చూడాలని ఉంది'లో తాను ముందుగా 'రామ్మా..చిలకమ్మా..' అనే ట్యూన్‌ని ప్రయోగాత్మకంగా చేశానని, కానీ చిరుకి నచ్చకపోవడంతో అది వద్దు వేరే ట్యూన్ ఇవ్వమని ఆదేశించాడని, రెండోట్యూన్ కూడా పూర్తయిన తర్వాత చిరంజీవి రెండో ట్యూన్ అంటే యూనిట్ అందరూ 'రామ్మా.. చిలకమ్మే' బాగుందని చెప్పడంతోనే ఆ చిత్రంలో ఆ పాట ఉందని, లేకుంటే లేకుండా పోయేదని చెబుతూ, సంగీతం విషయంలో కూడా స్టార్స్‌ని మెప్పించాలంటే దానికి బదులు స్వేచ్చగా ఉండే చిన్న చిత్రాలు చేసుకోవడం బెటర్ అని మణిశర్మ చిరంజీవిపై ఘాటుగానే వ్యాఖ్యలు చేశాడు.
ఇక పవన్ కళ్యాణ్ ది కూడా దర్శకత్వంలో వేలుపెట్టే రకమే. దానివల్లే 'సర్దార్‌గబ్బర్‌సింగ్' వంటి చిత్రాలు వస్తున్నాయని అందరూ చెవులు కొరుక్కుంటూ ఉంటారు. చాలా ఏళ్ల కిందటే మన స్టైలిష్ స్టార్ అందులో పరిపూర్ణ ఘనత సాధించాడు. ఓ విలేకరి మీరు దర్శకత్వంలో ఎక్కువగా వేలుపెడతారట కదా..! అని అడిగితే మా చిత్రాలు బాగా వచ్చేలా చూసుకోవడం మా బాధ్యత కాదా... మరి తప్పొప్పులు డైరెక్టర్‌కి మేము చెప్పకపోతే ఎలా? ఇది ఇంటర్‌ఫియరెన్స్ కాదు.. ఇన్‌వాల్వ్‌మెంట్ అని తేల్చేశాడు.
ఇక 'డిజె' విషయంలో హరీష్‌శంకర్ మాట్లాడుతూ, హీరో గురించి ఏదో గొప్పగా చెబుతున్నట్లు... ఇన్‌డైరెక్ట్‌గా అన్ని చేప్పేశాడు. సుత్తి లేకుండా దర్శకత్వంలో వేలుపెడుతున్నాడని, తనకు తగిన సూచనలు ఇచ్చేవాడని, కథను మార్చేశాడని, అప్పుడప్పుడు అతి విలువైన సలహాలు తనకి ఇచ్చేవాడని, మొత్తానికి ఈ హీరో తనకు కావాల్సినట్లు దర్శకుల చేత చేయించుకున్నాడని చెప్పేశాడు.
ఇక 'సరైనోడు,డిజె' ల విషయానికి వస్తే డివైడ్ టాక్ వచ్చిన చిత్రాలు కూడా 70కోట్లు షేర్ తెచ్చాయని అంటున్నారు. మరి ఇది నిజమైన లెక్కలో కాదో తెలియదు గానీ హిట్టయిన చిత్రాలే 60కోట్లకే చచ్చిచెడుతుంటే. డివైడ్‌టాక్ చిత్రాలు 70కోట్లు అని చెబుతున్నాడు. దాంతో 'సరైనోడు', 'డిజె' తర్వాత దర్శకత్వంలో బన్నీ వేలుపెట్టడం మరింత ఎక్కువైందని, ఆయన తాజాగా చేస్తున్న'నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా' చిత్రానికి పేరుకు మాత్రమే వక్కంతం వంశీని డైరెక్ట్‌గా ఎంట్రీ ఇప్పిస్తున్నానని చెబుతున్నాడే గానీ ఈచిత్రం ఇంత ఆలస్యం కావడానికి బన్నీ చెప్పిన మార్పులు చేర్పులే కాదు.. ప్రస్తుతం షూటింగ్‌లో కూడా దర్శకుడిని కుర్చీలో కూర్చొబెట్టి తతంగం మొత్తం బన్నీనే నడిపిస్తున్నాడని అంటున్నారు.