Advertisementt

రామ్ చరణ్ ఖాతాలో 100 కోట్ల సినిమా!

Thu 05th Oct 2017 02:37 PM
ram charan,rangasthalam 1985,100 crores,jai lava kusa,spyder,pre release business  రామ్ చరణ్ ఖాతాలో 100 కోట్ల సినిమా!
Rangasthalam 1985 Movie Pre-Release Reached 100 Crores రామ్ చరణ్ ఖాతాలో 100 కోట్ల సినిమా!
Advertisement
Ads by CJ

బాహుబలి తర్వాత తెలుగు సినిమాల రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కే ప్రతి ఒక్క సినిమా కూడా 100 కోట్ల మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కుతున్న సినిమాలే. మొన్నటికి మొన్న జై లవ కుశ 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి షాక్ ఇవ్వగా.. స్పైడర్ కూడా 150  కోట్ల బిజినెస్ చేసింది. పవన్, త్రివిక్రమ్ సినిమా గురించి ఇక చెప్పాల్సిన అవసరమే లేదు.  ఈ బిజినెస్  అంతా కలిపి అంటే ఆంధ్ర, సీడెడ్, నైజాంల బిజినెస్ తో పాటు అన్ని భాషల హక్కులు, శాటిలైట్ హక్కులతో కలిపి ఈ 100 కోట్ల మార్కెట్ ని సెట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ భారీ బడ్జెట్ సినిమాల మాదిరిగానే ఇప్పుడు రామ్ చరణ్ రంగస్థలం కూడా ఆ 100 కోట్ల బిజినెస్ చెయ్యడానికి రెడీ అయ్యింది.

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ - సమంత జంటగా నటిస్తున్న రంగస్థలం చిత్రం కూడా అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసింది. రంగస్థలం అన్ని భాషల శాటిలైట్ హక్కులు, మరియు డిజిటల్ రైట్స్ కి ఆడియో హక్కులకు కలిపి 30 కోట్లకు పైనే పలుకుతున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే ఆంధ్ర, సీడెడ్, నైజాంల ఏరియాల నుండి మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నట్టు ... ఆ ఆఫర్స్ తో చూసుకుంటే... 60 నుంచి 70  కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగేలా కనబడుతుందని చెబుతున్నారు. అదిపోగా ఓవర్సీస్, కర్ణాటక ఏరియా హక్కుల బ్యాలెన్స్ ఉండనే ఉంది.

మరి అన్ని టోటల్ గా లెక్కలేస్తే రంగస్థలం కూడా 100 కోట్ల మార్కెట్ ని ఈజీగా తాకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Rangasthalam 1985 Movie Pre-Release Reached 100 Crores:

Ram Charan 100 Crores Movie Rangasthalam 1985. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ