ఈ మధ్యన సినిమా విజయాలతో పనిలేకుండా... సినిమా విడుదలైన రెండు మూడు రోజుల్లోనే థాంక్స్ మీట్ అంటూ... లేదంటే... సక్సెస్ సెలెబ్రేషన్స్ అంటూ చిత్ర బృందాలు హడావిడి చెయ్యడం పరిపాటి అయ్యింది. అసలు సినిమా విజయం సాధించిందా లేదా అనేది పక్కన పెట్టేసి మా సినిమా కలెక్షన్స్ ఇంత కొల్లగొట్టింది అంత కొల్లగొట్టింది అంటూ ఆ సక్సెస్ మీట్స్ లో చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాము. ఇక హిట్ అయిన సినిమాలు సక్సెస్ మీట్ పెట్టినా ఓకేగాని.. హిట్ కాకపోయినా మా సినిమా హిట్ అంటూ పెట్టె సక్సెస్ మీట్స్ చూసి మాత్రం చాలామంది హేళనగా నవ్వుతూనే ఉన్నారు.
ఇక ఈ దసరా సెలవల్లో విడుదలైన జై లవ కుశ సినిమా విడుదలైన నాలుగో రోజున జై లవ కుశ జయోత్సవ వేడుక అంటూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాబీ... టోటల్ చిత్ర బృందం హడావిడి చేసింది. అలాగే ఆ తర్వాత వచ్చిన మహేష్ స్పైడర్ చిత్రం కి తెలుగులో పాజిటివ్ టాక్ రాలేదు. అయినా మా సినిమా ఇన్ని కోట్లు కొల్లగొట్టింది అన్ని కోట్లు కొల్లగొట్టింది అంటూ పోస్టర్స్ వేసుకుంటూ వచ్చేశారు. అలాగే స్పైడర్ నిర్మాతలు సినిమా విజయోత్సవ వేడుకకి కూడా ముహూర్తం పెట్టి ఏ హైదరాబాద్ లోనో.. లేకుంటే ఏ తిరుపతిలోనో.. లేకుంటే విజయవాడలోనో పెడదామని ప్లాన్ చేసి ఈ ప్రపోజల్ ని మహేష్ ముందు పెట్టగా దానికి మహేష్ వద్దు అనేశాడట.
స్పైడర్ సక్సెస్ మీట్ వద్దు... అలాంటి అతి మనకెందుకు అని చెప్పడంతో.... స్పైడర్ సక్సెస్ మీట్ ని మేకర్స్ రద్దుచేసి కేవలం యూనిట్ అంతా కలిసి పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూ లు అంటూ పెట్టారు. మరి మహేష్ చెప్పింది అక్షరాలా నిజం. అసలే సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చిందని ఫీల్ అవుతూ ఉంటే ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్ అవసరమా! ఇకపోతే స్పైడర్ సినిమా విడుదల తర్వాత మహేష్ ఫ్యామిలీ తో కలిసి విదేశాల్లో వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ విషయాల్ని మహేష్ వైఫ్ నమ్రత తాను తన పిల్లలతో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం ద్వారా క్లారిటీ ఇచ్చింది.