Advertisementt

అది విద్యాబాలన్ ది, ఇది రాయ్‌లక్ష్మిది!

Thu 05th Oct 2017 08:05 AM
raailaxmi,julie 2,dirty picture,julie 2 trailer report  అది విద్యాబాలన్ ది, ఇది రాయ్‌లక్ష్మిది!
Raailaxmi Julie 2 Trailer Released అది విద్యాబాలన్ ది, ఇది రాయ్‌లక్ష్మిది!
Advertisement
Ads by CJ

నేడు ఏదైనా అడల్ట్‌ మూవీ తీయాలంటే అందుకు అనుగుణంగా, అందులో హాట్‌సీన్స్‌, శృంగార భంగిమలు, బికినీ షోల వంటివి చూపించే విధంగా కథలను తయారు చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ఇక కథలో కావాల్సిన మసాలాలన్ని దట్టించి ఆ చిత్రం హాట్‌ హాట్‌గా, సరికొత్త అందాలను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈమద్య బాలీవుడ్‌ పోకడ చూస్తుంటే వారు అడల్ట్‌ చిత్రాల మాయలో ఎలా చిక్కుకుని ఉన్నారు? అడల్ట్‌ మూవీలో కంటే ఎక్కువగా సినిమాలోని సీన్స్‌ ఉండాలనేది వారికి అనిపిస్తున్నట్లుగా ఉంది. అదే ఉద్దేశ్యంలో నాటి క్యాబరే డ్యాన్సర్‌.. నేడు పేరును మార్చుకుని ఐటం సాంగ్‌, స్పెషల్‌సాంగ్‌ ముద్ర పడిన దక్షిణాది వ్యాంపు సిల్క్‌స్మిత జీవిత చరిత్ర ఆధారంగా నసీరుద్దీన్‌షా-విద్యాబాలన్‌ జంటగా 'డర్టీ పిక్చర్‌' వచ్చింది. వ్యాంపు నిజజీవితం కాబట్టి సహజంగానే బాగా గ్లామర్‌షోతో పాటు మితిమీరి ఉంది. అయినా ఈ చిత్రం మంచి విజయం సాధించి నిర్మాతలకు, పంపిణీదారులకు బాగా లాభాలు తెచ్చిపెట్టింది. 

ఇక దక్షిణాదిలో రాణించలేకపోయిన రాయ్‌లక్ష్మి బాలీవుడ్‌లో పాగా వేయడానికి కూడా ఇటువంటి 'డర్టీ పిక్చర్‌' కథనే ఎంచుకుంది. ఇలాంటి సబ్జెక్ట్‌లలో ఎంత మితిమీరిన శృంగారం చూపించినా సెన్సార్‌ వారికి కూడా పెద్దగా చిక్కరు. ఓ హీరోయిన్‌ కావాలని ఆశపడే అమ్మాయి జీవిత గాధగా 'జూలీ2' రూపొందింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ బాగా సంచలనం సృష్టించింది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ కూడా టీజర్‌కి కొనసాగింపుగానే ఉంది కానీ స్పెషల్‌గా ఏమీ లేదు. ఈ చిత్రం చూస్తుంటే కేవలం రాయ్‌లక్ష్మి అందాల ఆరబోత కోసమే చిత్రం తీశారా? అనిపించకమానదు. ఈ చిత్రం 6వ తేదీన విడుదల కానుంది. ఇక ఈ ట్రైలర్‌లో మాత్రం బ్యాగ్రౌండ్‌లో వచ్చిన 'ఓ జూలీ' అనే మెలోడీ గీతం మాత్రం బాగాఉంది అని చెప్పాలి....! 

Raailaxmi Julie 2 Trailer Released:

Julie 2 Trailer- Another Dirty Picture

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ