Advertisementt

ప్రభాస్, అనుష్క- డైరెక్ట్ గా నిశ్చితార్థమే!

Wed 04th Oct 2017 04:16 PM
umair sandhu,prabhas,anushka,engagement,december  ప్రభాస్, అనుష్క- డైరెక్ట్ గా నిశ్చితార్థమే!
Umair Sandhu Shocking Tweet on Prabhas-Anushka Marriage ప్రభాస్, అనుష్క- డైరెక్ట్ గా నిశ్చితార్థమే!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో 'బిల్లా, మిర్చి, బాహుబలి'లతో ఆన్‌స్క్రీన్‌ హాట్‌ జంటగా, తమ పాత్రల మద్య కెమిస్ట్రీని ప్రభాస్, అనుష్క లు బాగా పండించారు. 'మిర్చి' వరకు వీరిద్దరు తెలుగులోనే హాట్‌పెయిర్‌ అనుకుంటే 'బాహుబలి' పుణ్యమా? అని వీరు దేశవ్యాప్తంగా కూడా హాట్‌పెయిర్‌ అయిపోయారు. ఇక ప్రభాస్‌, అనుష్కలు త్వరలో వివాహం చేసుకోనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. దీనిపై అనుష్క ఫైర్‌ అయింది. మరోసారి ఇలాంటి తప్పుడు రాతలు రాస్తే లీగల్‌గా కూడా చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. 

ఇక ప్రభాస్‌ మా మద్య ఏదో ఉందని రాస్తున్నారు. దాంతో వారు రాసేదే నిజమా? మా ఇద్దరి మద్య ఏమైనా ఉందా? అని మాకే అనుమానం వస్తోంది. పెళ్లి చేసుకోబోయే ముందు మీకందరికీ తెలిపే చేసుకుంటానని, పెద్దలు చెప్పిన వివాహమేనని తెలిపాడు. ఇక తాజాగా ప్రముఖ సినీ విశ్లేషకుడు, ట్రేడ్‌ ఎనలిస్ట్‌ ఉమైర్‌సంధు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

వారిద్దరు డిసెంబర్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంటారని ట్వీట్‌ చేశాడు. వారిద్దరు ప్రస్తుతం రిలేషన్‌లో ఉన్నారని, ఈ విషయాన్ని ప్రభాస్‌, అనుష్కల క్లోజ్‌ఫ్రెండ్‌ తనకి చెప్పాడని, వీరిద్దరికి ఒకరంటే మరొకరికి ఎంతో ప్రేమ ఉందని, ఒకరి పట్ల మరొకరు బాగా కేర్‌ తీసుకుంటారని తెలిపాడు. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో? అసలు వాస్తవమే లేదో? ప్రభాస్‌, అనుష్కలలో ఎవరైనా నోరు విప్పితేగానీ తెలియదు.

Umair Sandhu Shocking Tweet on Prabhas-Anushka Marriage:

Umair Sandhu says Young Rebel Star Prabhas and gorgeous beauty Anushka have been in relationship for quite some days.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ