వరుస విజయాలతో ఇయర్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా దూసుకుపోతోన్న నిర్మాత దిల్ రాజు. డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఆయన సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్. దిల్ రాజు నిర్మాణంలో సినిమా తీశాడంటే అది పక్కా కేలిక్యులేటెడ్ గా ఉంటుంది అని ప్రేక్షకులు కూడా నమ్మేసేంతగా సక్సెస్ రేట్ దిల్ రాజు సొంతం. అయితే సినిమా ఒక వేళ ఫ్లాప్ అయిన అతని డబ్బులు మాత్రం ఎక్కడికి పోవు. ఈ మధ్య ఏ సినిమాని నిర్మించినా ఆ సినిమాలన్నీ ఆయనకి వరుస హిట్స్ అందిస్తూనే ఉన్నాయి. దువ్వాడ జగన్నాధం సినిమా ఎవరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ కుమ్మేశాయని స్వయంగా దిల్ రాజు ప్రకటించడం అప్పట్లో సంచలనం అయ్యింది.
అయితే మరో వైపు దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగుతూ పెద్ద పెద్ద సినిమాల రైట్స్ లో అప్పుడప్పుడు ఏదో ఒక ఏరియా రైట్స్ సొంతం చేసుకొని సినిమా రిలీజ్ చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే తాజాగా దసరా బరిలో దిగిన జై లవ కుశ, స్పైడర్, మహానుభావుడు రైట్స్ కూడా కొన్ని ఏరియాలలో దక్కించుకున్నాడు. అలాగే స్పైడర్ నైజాం రైట్స్ ని 25 కోట్లుకి సొంతం చేసుకున్నాడు. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి రోజు మాత్రం కలెక్షన్స్ భాగానే కొల్లగొట్టినప్పటికీ.. స్పైడర్ కి మొదటి షోకే డివైడ్ టాక్ రావడంతో రెండో రోజు నుండి కలెక్షన్స్ సడెన్గా డ్రాప్ అవుతూ వచ్చాయి. నైజాంలో మొదటి రోజు కలెక్షన్స్ బాగున్న క్రమంగా డ్రాప్ అవుతూ వచ్చాయి.
నైజామ్ లో స్పైడర్ మొదటి రోజు కలెక్షన్స్ 4.7 కోట్లు తెచ్చుకోగా మొత్తం 6 రోజులకి 9 కోట్లు క్రాస్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడు సినిమా ఓవరాల్ గా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం ఇక కలెక్షన్స్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. లాంగ్ రన్ లో చూసుకున్నా నైజాం కలెక్షన్స్ 12 కోట్లుకి మించి దాటే అవకాశాలు లేవంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి ఈ విధంగా చూసుకుంటే స్పైడర్ తో దిల్ రాజు భారీగా మునిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అంటున్నారు. కేవలం మహేష్, మురుగదాస్ కాంబినేషన్ మీద ఉన్న నమ్మకంతో దిల్ రాజు ధైర్యం చేసి స్పైడర్ ని భారీ రేటుకి కొన్నాడు. కానీ దిల్ రాజు మ్యాజిక్ ఇక్కడ పని చేయలేదు. భారీ లాస్ వచ్చేలానే వుంది.