Advertisementt

రణవీర్ డెడ్లీ లుక్ తో అదరకొడుతున్నాడు..!

Wed 04th Oct 2017 11:16 AM
alauddin khilji,padmavati,ranveer singh,sultan,look  రణవీర్ డెడ్లీ లుక్ తో అదరకొడుతున్నాడు..!
Ranveer Singh Sultan Alauddin Khilji Look రణవీర్ డెడ్లీ లుక్ తో అదరకొడుతున్నాడు..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం సంజయ్‌లీలా భన్సాలీ దీపికా పడుకొనే ప్రధాన పాత్రలో 'పద్మావతి' అనే చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. ఇక సంజయ్‌లీలా భన్సాలీ తీసే ఇలాంటి చిత్రాలు చరిత్రను తప్పుదోవ పట్టించే విధంగా ఉంటాయని, వీరనారి అయిన పద్మావతి శత్రుదేశపు రాజైన అల్లావుద్దీన్‌ ఖిల్జీ ప్రేమలో పడినట్లు సినిమాలో చూపిస్తున్నారని తెలిసి కొంతకాలం కిందట 'కర్ణిసేన'కి చెందిన పలువురు కార్యకర్తలు షూటింగ్‌ స్పాట్‌కి వచ్చి విచక్షణా రహితంగా కాల్పులు జరిపి, షూటింగ్‌ సెట్స్‌ని నాశనం చేశారు. 

కానీ ఈ చిత్రం కథ ఉన్నది ఉన్నట్లుగానే  తీస్తున్నానని, ఎలాంటి వక్రీకరణకు చోటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు భన్సాలీ ప్రకటించాడు. ఇక ఈ చిత్రంలోని టైటిల్‌ వేషధారిణి 'పద్మావతి' లుక్‌లో దీపికాపడుకోనే, మహారాజా రావల్‌ రతన్‌సింగ్‌ పాత్రధారి షాహిద్‌పూర్ల ఫస్ట్‌లుక్స్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అల్లావుద్దీన్‌ ఖిల్జీ ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. 

ఈ సుల్తాన్‌ లుక్‌ని చూసిన వారంతా ఫిదా అయిపోతున్నారు. ఈ పాత్రను పోషిస్తున్న రణవీర్‌ సింగ్‌ భయానక డెడ్లీ లుక్‌తో అదరగొట్టాడు. పొడవైన శిరోజాలు, భీకరమైన కంటిచూపు, మొహంపై కత్తిగాటుతో ఖిల్జీ ఫస్ట్‌లుక్‌కి విశేష ఆదరణ లభిస్తోంది. కాగా డిసెంబర్‌ 1వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రంపై బాలీవుడ్‌లో భారీగా అంచనాలున్నాయి. ఈచిత్రాన్ని తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో కూడా అనువాదం చేసి 'బాహుబలి'ని టార్కెట్‌ చేస్తున్నట్లు సమాచారం. 

Ranveer Singh Sultan Alauddin Khilji Look:

Padmavati Movie Alauddin Khilji Look Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ