నాగ చైతన్య - సమంతలు మరో రెండు రోజుల్లోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. అక్టోబర్ 6 న హిందూ సంప్రదాయంలో,అక్టోబర్ 7 న క్రిష్టియన్ సంప్రదాయంలోనూ పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట పెళ్లి తర్వాత హనీమూన్ గినీ మూన్ లేదంటూ ఆ మధ్యన తెగ స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. పెళ్లి తర్వాత ఎటువంటి బ్రేక్ తీసుకోకుండా తమ షూటింగ్స్ లో బిజీ అవుతామని చెప్పేశారు. ఇక ఈ హాని మూన్ విషయంలో సమంత ఎప్పటికప్పుడు క్లారిటీగానే వుంది. మరి పెళ్ళికి ముందు భీభత్సంగా వెకేషన్స్ ని ఎంజాయ్ చేసిన ఈ జంట పెళ్లి తర్వాత అంటే దాదాపు మూడు నెలల తర్వాతే హనీమూన్ కి వెళుతున్నట్టుగా సమంత చెబుతుంది.
పెళ్లి తర్వాత మూడు రోజుల్లోనే తమ తమ సినిమా షూటింగ్ లకు హాజరయిన తర్వాతే హనీమూన్ అంటుంది. అసలు 6 , 7 తేదీల్లో పెళ్లి తర్వాత.... అప్పుడే హానిమూన్ ఆలోచనే లేదని చెబుతుంది. అయితే వీరు ఇలా హనీమూన్ ని మూడు నెలల తర్వాత పెట్టుకోవడానికి తమ సినిమాల కమిట్మెంట్స్ ఒక కారణమైతే...మరొకటి మూడు నెలల తర్వాత ఫ్రెషగా డిసెంబర్ చివరిలో.. యురోప్ అమెరికా టూర్ కు వెళితే అక్కడ వుండే కిక్కే డిఫరెంట్ గా ఉంటుందట. అందులోను క్రిస్టమస్ అండ్ న్యూ ఇయర్ సమయం కాబట్టి.. అక్కడి ప్రాంతాలన్నీ భలే రిఫ్రెషింగ్ గా ఉంటాయి. అందుకే ఆ సమయంలో నాగ చైతన్య, సమంతలు హనీమూన్ ప్లాన్ చేసుకున్నారట.
మరి ముందు వర్క్ తర్వాతే ఎంజాయ్మెంట్ అని బిల్డప్ ఇచ్చినా కూడా సమంత - నాగ చైతన్య లు మాత్రం లేటైనా లేటేస్టుగానే ఎంజాయ్ చెయ్యబోతున్నారు. ఇక చైతు-సామ్ ల పెళ్ళికి టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి కేవలం కొద్దిమంది అతిరథమహారధులు మాత్రమే హాజరవుతున్నారు. ఇక సింపిల్ గా జరగబోయే ఈ పెళ్ళికి 10 కోట్ల ఖర్చు అవుతున్నట్టుగా వార్తలొస్తున్నాయి.