ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ సినిమాలపై, సినీ నటులపై ఎక్కువగా దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఆయన తన దూరపు బంధువైన విజయ్‌దేవరకొండ చిత్రం 'అర్జున్‌రెడ్డి'ని చూసి చాలా బాగుందని తానే ప్రమోషన్ తరహా కామెంట్స్ చేశాడు. అంతకు ముందు వచ్చిన 'ఫిదా' చిత్రం తెలంగాణ సంప్రదాయాలతో తయారైన చిత్రం కావడంతో దానికి కూడా కేసీఆర్, కేటీఆర్, కవితలు మంచి సపోర్ట్‌నే అందించారు. ఇక తాజాగా కేటీఆర్‌కి మరో ప్రశ్న అనూహ్యంగా ఎదురైంది. అయినా దానికి కేటీఆర్ ఎంతో తెలివిగా సమాధానం చెప్పి మెప్పించాడు. దసరా సందర్భంగా ఇద్దరు నెటిజన్లు కేటీఆర్‌ని ఉద్దేశించి రెండు ట్వీట్స్ చేశారు. అందులో ఒకటి 'రావణున్ని సంహరిద్దాం.. హ్యాపీ దసరా'అని ఒకరు పదితలలు ఉన్న రావణాసరుడి సంహారానికి బాణం ఎక్కుపెట్టి ఉన్న ఫొటోలను పోస్ట్ చేయగా, ప్రతి ఒక్కరి ప్రారంభం ఒకేలా ఉంటుంది.
కానీ ముగింపును నిర్ణయించేది మాత్రం వారి 'కర్మ' అని అంటూ 'రామ్, రావణా' అనే అర్ధాలు వచ్చేలా పోస్టర్‌ని మరో నెటిజన్ పోస్ట్ చేశాడు. వీటిని చూసిన కేటీఆర్ రెండు మెసేజ్‌లు బాగున్నాయని ప్రశంసించాడు. అయితే 'రావణుడ్ని సంహరిద్దాం.. హ్యాపీ దసరా' అనే ట్వీట్‌ని చూసి ఓ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కేటీఆర్‌ని ఉద్దేశించి 'జాగ్రత్త కేటీఆర్ సార్ ..జై దారిలో ఉన్నాడు' అని ట్వీట్ చేశాడు. దీనికి సెటైర్‌గా అన్నట్లు కేటీఆర్ ఏం ఫర్వాలేదు.
బాధపడకు మిత్రమా.. జూనియర్ వ్యక్తిగతంగా నాకు చాలా మంచి మిత్రుడు....జై గురించిన బాధ్యత అతను చూసుకుంటాడు ఖచ్చితంగా చూసుకుంటాడని గట్టిగా చెప్పగలను.. అంటూ తనదైన శైలిలో పంచ్ వేశాడు. ఇక ఏపీసీఎం చంద్రబాబుకు సినిమా వారంటే చాలా పిచ్చి. వారి వల్ల ఏదో ఒనగూడుతుందనే ఆలోచనలో ఉంటాడు. మరి ఇప్పుడు కేటీఆర్ కూడా అదే దారిలో నడుస్తున్నాడా? అని అనుమానం రాకుండా మానదు.