Advertisementt

వివాదంతో ఉపయోగం ఉందా..? లేదా..?

Tue 03rd Oct 2017 06:40 PM
spyder movie,mahesh babu,arjun reddy,ar murugadoss,controversy  వివాదంతో ఉపయోగం ఉందా..? లేదా..?
Has Use of Controversy? Or..? వివాదంతో ఉపయోగం ఉందా..? లేదా..?
Advertisement
Ads by CJ

సినిమా కంటెంట్‌ నుంచి టైటిల్స్‌, ప్రమోషన్‌, థియేటర్లలలో రిలీజయినప్పుడు కొన్ని చిత్రాలకు అనుకోని వరాలు వస్తుంటాయి. అవి ఆ చిత్రం పై మరింత ఆసక్తిని కలుగుజేయడానికి బాగా ఉపయోగపడతాయి. మంచు విష్ణు నటించిన 'దేనికైనా రెడీ', 'డిజె' చిత్రంలోని పాటల్లో నమకం, చమకం.. అంటూ వచ్చిన వివాదాలు ఈచిత్రానికి మంచి ప్రమోషన్‌ లభించేలా చూసి, సినిమాలు గట్టెక్కడానికి ఉపయోగపడ్డాయి. 

ఇక 'అర్జున్‌ రెడ్డి' చిత్రం విషయానికి వస్తే ఈ చిత్రంపై వచ్చినంత కాంట్రవర్సీ మరో చిత్రానికి రాలేదు. దానికి తోడు సినిమా కూడా యూత్‌కి బాగా కనెక్ట్‌ కావడంతో ఈ చిత్రం వసూళ్లని బాగా రాబట్టడంతో సక్సెస్‌ అయింది. అయితే సినిమాలో కంటెంట్‌ ఎంత ముఖ్యమో? వివాదాలలో కూడా మంచి పాయింట్‌ ఉండాలి. అప్పుడే ఆ వివాదాలు సినిమా ఊపుకు ఉపయోగపడతాయి. ఏదో సాదాసీదా కాంట్రవర్శీ కాకుండా బలమైన కంటెంట్‌ ఉన్న వివాదాలే తామనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తాయి. 

తాజాగా మహేష్‌బాబు-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో ఓ వివాదం తలెత్తింది. ఈ చిత్రం కాటి కాపరుల మనోభావాలకు వ్యతిరేకంగా, ఎందరో దళితులు ఉన్న కాటికాపరి వ్యక్తులలో దళితులు రాత్రింబగళ్లు ఎండనక వాననక కష్టపడుతుంటే వారిని కించిపరిచేలా 'స్పైడర్‌' చిత్రంలోని సన్నివేశాలున్నాయని, వాటిని తొలగించాలని కాటికాపర్ల సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఒక వేళ ఈ సన్నివేశాలను తొలగించకపోతే రాష్ట్రస్థాయి ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. 

అయితే సమాజంలో బలమైన సామాజిక వర్గాలు, లేదా 'అర్జున్‌ రెడ్డి' వంటి వివాదాలు తప్ప ఇలా తక్కువ సంఖ్యాకులుండే కాటి కాపర్ల కాంట్రవర్శీ సినిమాకి వివాదంగా మారినా కూడా దీని వల్ల 'స్పైడర్‌'కి కొత్తగా వచ్చే లాభం ఏమిలేదని కొందరు కొట్టిపడేస్తున్నారు. ఇక ఈ రోజు నుంచి పిల్లలకు స్కూల్స్‌, ఉద్యోగులు తమ తమ పనుల్లో బిజీ కావడంతో నేటి నుంచి దసరా సినిమాల అసలు సత్తా తెలిసే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రం తెలుగులో ఇప్పటికే చేతులు ఎత్తేశాయి, తమిళంలో మాత్రం ఫర్వాలేదు.. బాగుందనే టాక్‌తో రన్‌ కావడం విశేషంగా చెప్పాలి. 

Has Use of Controversy? Or..?:

Even though Katy's cobbler's controversy has become a controversy, some are dismissing it as a new gain for "spider".

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ