విజయ్ దేవరకొండ - సందీప్ రెడ్డి వంగా కలయికలో వచ్చిన అర్జున్ రెడ్డి అనూహ్యంగా కుర్రకారుని కట్టిపడేసింది. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి చిత్రంలో ముద్దు సీన్స్ ఎక్కువగా ఉన్నాయని సెన్సార్ సభ్యులతోపాటు విహెచ్, మహిళా సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయినా సినిమాకి అదిరి పోయే కలెక్షన్స్ అంటే... సినిమా కోసం 4.5 కోట్లు ఖర్చు పెడితే ఏకంగా 40 కోట్ల పైనే అర్జున్ రెడ్డి కొల్లగొట్టింది.
ఇకపోతే అర్జున్‌రెడ్డి మూవీ శాటిలైట్ రైట్స్ విషయంలో చాలానే తతంగం జరిగింది. అర్జున్ రెడ్డి శాటిలైట్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడినప్పటికీ... సెన్సార్ అభ్యంతరాలతో సినిమా విడుదలకు ముందే కొన్ని మ్యూట్ వేయించుకుంది... మరి ఛానల్ లో ఈ సినిమా వేస్తే గనక ఇంకెన్ని మ్యూట్స్ వేస్తారో... అలాగే ఇంకెన్ని వల్గర్ సీన్స్ కట్ చేస్తారో అని ఆ అర్జున్ రెడ్డి శాటిలైట్ హక్కులను తీసుకోవడానికి ఎవరు పెద్దగా ముందుకు రాలేదు. అయితే తాజాగా ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఫైనల్ గా అర్జున్ రెడ్డి చిత్రం శాటిలైట్ రైట్స్‌ని స్టార్ మా దక్కించుకుంది. దాదాపు మూడుకోట్లకు స్టార్ మా ఈ హక్కులను కైవసం చేసుకున్నట్టుగా వార్తలొస్తున్నాయి.
అయితే ఆ మూడు కోట్లకి అర్జున్ రెడ్డిని జీ తెలుగు తీసుకోవాలని భావించినప్పటికీ వల్గర్ డైలాగ్స్ తోపాటు కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కట్ చేస్తారని భావించి వెనుకడుగు వేసిందనే టాక్ ఉంది. అవి కట్ చేసినా పర్వాలేదని స్టార్ మా అర్జున్ రెడ్డిని కొనేసింది అంటున్నారు.