Advertisementt

చైతూ సరసన హీరోయిన్ సెట్టయింది!

Tue 03rd Oct 2017 04:51 PM
savyasachi,naga chaitanya,nidhi agarwal,savyasachi movie heroine  చైతూ సరసన హీరోయిన్ సెట్టయింది!
Nidhi Agarwal in Naga Chaitanya Savyasachi చైతూ సరసన హీరోయిన్ సెట్టయింది!
Advertisement
Ads by CJ

'ప్రేమమ్‌, రారండోయ్‌ వేడుకచూద్దాం' చిత్రాలతో వరుసగా రెండు విజయాలను తన ఖాతాలో వేసుకున్న నాగచైతన్యకు 'యుద్దం శరణం' చిత్రం మాత్రం తీవ్రంగా నిరాశను మిగిల్చింది. ఈ చిత్రం నిర్మాత సాయి కొర్రపాటికి కూడా భారీ నష్టాలనే మిగిల్చింది. కాగా ఈచిత్రం పరాజయాన్ని తన తదుపరి చిత్రం ద్వారా తుడిచిపెట్టాలని నాగచైతన్య భావిస్తున్నాడు. ఆయన ప్రస్తుతం చందుమొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' అనే ఇంట్రస్టింగ్‌ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం టైటిలే కాదు.. పోస్టర్‌ కూడా ఎంతో కొత్తదనంగా ఉంది.

మైత్రిమూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండటం విశేషం. ఇక ఈచిత్రంలో హీరోయిన్‌ కోసం వెతుకులాట మొదలైంది. చివరకు ఓ బాలీవుడ్‌ సెక్సీ సుందరిని ఏరికోరి ఎంచుకున్నారట. టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా 'మున్నా మైఖేల్‌' చిత్రంలో నటించిన నిధి అగర్వాల్‌. ఈచిత్రం బాగా ఆడకపోయిన ఈ మొదటి చిత్రం ద్వారా ఈమెకి మంచి సెక్సీ ఇమేజ్‌ వచ్చింది. ఇటీవలే దర్శకుడు చందుమొండేటి ఈ భామని కలిసి స్టోరీని వినిపించి వచ్చాడట. ఆమె కూడా ఈ ప్రపోజల్‌కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌ది విభిన్నకోణాలుంటే ఓ కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. మొత్తానికి నాగచైతన్య 'సవ్యసాచి'పై ఎన్నో నమ్మకాలు పెట్టుకుని ఉన్నాడు. 

Nidhi Agarwal in Naga Chaitanya Savyasachi:

Bollywood Actress Nidhi Agarwal Got the Chance besides Naga Chaitanya in Savyasachi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ