మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' అనే చిత్రం చేస్తున్నాడు. అదేసమయంలో ఆయన తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మక చిత్రం 'సై..రా.. నరసింహారెడ్డి' చిత్రాన్ని నిర్మించనున్నాడు. దీంతో అన్ని బాధ్యతలను తన భర్త మోయడం కష్టమని భావించిన ఉపాసన తన భర్త బాధ్యతల్లో కొన్ని పనులను చూస్తోందని సమాచారం. కాగా ఆమె 'ఖైదీనెంబర్ 150, దృవ' చిత్రాలకు కూడా వర్కింగ్ ప్రొడ్యూసర్‌గా పనిచేసింది గానీ పేరు వేసుకోలేదు.
మరోవైపు 'సై...రా' చిత్రానికి మెగాస్టార్ కూతుర్లు కూడా కాస్ట్యూమ్స్‌వంటి బాధ్యలను నిర్వర్తించారు. 'సై...రా' చిత్రానికి కూడా వారు అవే బాధ్యతలను నిర్వహిస్తు ఉన్నారు. దీంతో రామ్‌చరణ్‌కి కాస్త రిలాక్స్‌గా పనిచేసే అదృష్టం కలిగింది. ఇక ప్రస్తుతం ఈచిత్రం కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్స్‌ని నెలకొలుపుతున్నారు. నయనతార కూడా విదేశాల నుంచి వచ్చేసింది. దీంతో త్వరలోనే సురేందర్‌రెడ్డి పక్కా ప్రణాళికతో ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 20 వతేదీ నుంచి ఈచిత్రం షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.