పండగలకి భారీ పోటీ ఉన్నా కూడా శర్వానంద్ ఆ పోటీకి భయపడకుండా తట్టుకుని ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఆయన తాజాగా నటించిన 'మహానుభావుడు' చిత్రం కూడా 'జైలవకుశ', 'స్పైడర్' చిత్రాల పోటీలో వచ్చి మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక ఈ విషయంలో శర్వా ఇందులో తన గొప్పతనం ఏమీ లేదని, డిఫరెంట్ స్టోరీలు ఎంచుకుంటూ ఉండటమే దానికి కారణంగాపేర్కొన్నాడు. తాజాగా దసరాకి వచ్చిన ఎన్టీఆర్, మహేష్‌బాబుల చిత్రాలు డిఫరెంట్ జోనర్స్‌వని, తమ 'మహానుబావుడు' మంచి కామెడీ ఎంటర్‌టైనర్ కావడం తమ చిత్రానికి ప్లస్ అయిందని చెప్పుకొచ్చాడు.
ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన మారుతి... ఈ చిత్రంలోని హీరో పాత్రలో తాను పరకాయ ప్రవేశం చేశానని చెప్పడం, ప్రభాస్ అన్నయ్య తనను కాబోయే సూపర్‌స్టార్ అని చెప్పడం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. రొటీన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'రాధ' చేసినప్పుడు అంత నీకు అవసరమా? నీ బాటలోనే నువ్వు నడవ వచ్చు కదా? అని చాలామంది సలహా ఇచ్చారు. ఈచిత్రం రిజల్ట్ చూసినతర్వాత వారు చెప్పిందే కరెక్ట్ అనిపించింది. ఇకపై రొటీన్ పాత్రలు చేయను. ప్రస్తుతానికి రెండు సినిమాలు ఓకే చేశాను. సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓచిత్రం,రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్‌కోవెలమూడి దర్శకత్వంలో ఓ చిత్రం ఒప్పుకున్నానని శర్వానంద్ చెప్పుకొచ్చారు.