తెలుగు సినీ ఇండస్ట్రీలో నాగార్జున కి బాలకృష్ణ కి ఎప్పటినుండో పడదనే విషయం అందరికి తెలిసిందే. అక్కినేని నాగేశ్వర రావు చనిపోయినప్పుడు సినిమా ఇండస్ట్రీ ఇండస్ట్రీ తరలి వచ్చినా బాలకృష్ణ రాలేదు.... అంటేనే నాగ్ కి బాలయ్య కి మధ్యన ఎంత విభేదాలున్నాయా చెప్పొచ్చు అంటారు జనాలు. అయితే మొన్నామధ్యన అనూహ్యంగా సుబ్బిరామిరెడ్డి నిర్వహించిన విశాఖలో జరిగిన మోహన్ బాబు 40 ఇయర్స్ ఫంక్షన్ లో బాలకృష్ణని నాగార్జునని ఒకేసారి వేదిక మీదకి పిలిచి అందరికి షాక్ ఇచ్చాడు. ఇక అక్కడ నాగ్, బాలయ్యలు చేసేది లేక హగ్ ఇచ్చుకుని తమ మధ్యన విభేదాలు లేవని ఓపెన్ గానే చెప్పారు.
అయితే అప్పుడేదో జనాల కోసం హగ్ ఇచ్చుకున్నారు... వారి ఆమధ్య విభేదాలు అలాగే వున్నాయనే ప్రచారం జరిగింది. అయితే ఇపుడు తాజాగా బాలకృష్ణ... నాగార్జున ఆహ్వానాన్ని మన్నించి నాగచైతన్య పెళ్ళికి వెళ్ళబోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి. నాగ చైతన్య - సమంతల పెళ్లి గోవాలో ఈ నెల 6 న జరగబోతున్న విషయం తెలిసిందే. ఆ పెళ్ళికి నాగార్జున కొద్దిమంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించాడని అందులో నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నాడని తెలుస్తుంది. బాలయ్యని నాగార్జున ప్రత్యేకంగా ఆహ్వానించాడని... బాలకృష్ణ కూడా పెళ్ళికి తప్పక వస్తానని చెప్పినట్లుగా ప్రచారం మొదలైంది.
అలాగే బాలకృష్ణ తో పాటే చిరు, పవన్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు లు కూడా చైతు - సామ్ ల పెళ్ళికి హాజరవుతున్నట్టుగా సమాచారం అందుతుంది. 6 , 7 తేదీల్లో జరగబోయే చైతు పెళ్లికి టాలీవుడ్ సెలెబ్రిటీస్ గోవా కి బయలుదేరతారని తెలుస్తుంది. మరి ఈ పెళ్ళిలో టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా చేసే హడావిడి మాములుగా ఉండదనే టాక్ వినబడుతుంది. ఇక సినీప్రముఖులతో పాటే నాగార్జున సన్నిహితులు కూడా ఈ పెళ్ళికి హాజరవుతున్నారు.