Advertisementt

చిరు కోసం హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా?

Tue 03rd Oct 2017 10:40 AM
nayantara,sye raa narasimha reddy,chiranjeevi,ram charan,surender reddy  చిరు కోసం హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా?
Nayantara Villain Role in Sye Raa Narasimha Reddy? చిరు కోసం హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా?
Advertisement
Ads by CJ

బాలకృష్ణ 102 వ చిత్రం షూటింగ్ లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన నయనతార అక్కడ నుండి తన బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ పుట్టినరోజు వేడుకల కోసం అమెరికా చెక్కేసిన విషయం తెలిసిందే. అక్కడ న్యూయార్క్ లో విగ్నేష్ బర్త్ డే వేడుకలు ఒక హోటల్ లో గ్రాండ్ గా జరిగాయి. మరి విగ్నేష్ శివన్ తో ప్రేమాయణం నడుపుతున్న ఈ భామ పెళ్లిమాట ఎత్తేసరికి మాత్రం ఇంకో రెండేళ్లు అంటుంది. ఇకపోతే అమెరికాలో ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన నయనతార ఇప్పుడు చెన్నైకి చేరుకోవడమే కాదు... సినిమా షూటింగ్స్ లో పాల్గొనడానికి రెడీగా ఉంది. అటు తమిళం ఇటు తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న నయనతార ఇప్పుడు ఎక్కువగా తెలుగు సినిమాల మీదే ఫోకస్ పెట్టిందట.

ఇప్పటికే బాలకృష్ణ -రవికుమార్ కలయికలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న నయనతార ఇప్పుడు చిరంజీవితో చేయబోయే సై రా నరసింహా రెడ్డి షూటింగ్ కోసం తయారైందట. సై రా కోసం పక్కా కాల్షీట్స్ కేటాయించిన నయన్ ఈ నెల 20  నుండి పారంభమయ్యే చిరు 151 వ చిత్రం సైరా షూటింగ్ లో పాల్గొనబోతుననట్లుగా ప్రచారం మొదలైంది. ఇక ఈ చిత్రంలో నరసింహారెడ్డికి అంటే చిరుకి  విలన్ గా నయనతార కనబడబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సై రా కోసం ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని  నానక్ రామ్ గూడలో ఒక పెద్ద విలేజ్ సెట్ నిర్మాణం జరుగుతుంది. ఇక ఈ సెట్ లోనే చిరంజీవి, నయనతారల మధ్య కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారనే సమాచారం అందుతుంది.

మరో పక్క సైరా సినిమా మొదలవడానికి సినిమాటోగ్రాఫర్ కావాలి కదా అంటున్నారు. ఎందుకంటే సైరా కోసం ఎంపిక చేసిన రత్నవేలు ప్రస్తుతానికి రామ్ చరణ్ రంగస్థలం షూటింగ్ లో బిజీగా వున్నాడని చెబుతున్నారు. మరి నయన్ ఇచ్చిన కాల్షీట్స్ లోనే సైరా షూటింగ్ మొదలవుతుందో లేదో అనేది మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదుగాని విలన్ పాత్ర చేయ్యబోతున్న హీరోయిన్ నయన్ మాత్రం సై రా కోసం సిద్ధంగా వుంది.

Nayantara Villain Role in Sye Raa Narasimha Reddy?:

Chiranjeevi 151 movie Sye Raa Narasimha Reddy in this movie Nayantara starring villain role.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ