బాహుబలి తర్వాత అమరశిల్పి జక్కన్న అంతగా పేరు తెచ్చుకున్న రాజమౌళి ఆ చిత్రం ద్వారా తనకు వచ్చిన డబ్బుతో హైదరాబాద్ శివార్లలోని 120 ఎకరాల భూములను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దానిలో 50ఎకరాలు మామిడి, సపోటా చెట్ల పెంపకానికి, మరో 50 ఎకరాలు వ్యవసాయానికి కేటాయించాడు. ఇక ఎకరాలో తన ఫాంహోస్‌ని నిర్మించుకుంటున్నాడు.
ఇక ఇతర హంగామాలు, తన వ్యవసాయ క్షేత్రానికి రోడ్లు, ఇతర సదుపాయాలపై ఇప్పుడు జక్కన్న దృష్టి పెట్టాడు. మొత్తానికి రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం' విషయం పక్కనపెట్టి తన ఫామ్ హౌస్, వ్యవసాయ క్షేత్రాల డ్రీమ్ ప్రాజెక్ట్‌కి మాత్రం రెడీ అయిపోయాడు. ఇక ఈ స్థలంలో చిన్న చిన్న గుడిసెలను కూడా నిర్మించి అందులో ఆవులను పెంచే గోసంరక్షణ కేంద్రం పెట్టాలని నిర్ణయించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.