Advertisementt

మంచు హీరోలు దీన్ని ఏమంటారు?

Mon 02nd Oct 2017 07:24 PM
kurjal 388,manchu vishnu,manchu manoj,kollywood,okkadu migiladu,achari america yatra  మంచు హీరోలు దీన్ని ఏమంటారు?
Manchu Heroes Eye on Kollywood మంచు హీరోలు దీన్ని ఏమంటారు?
Advertisement
Ads by CJ

తెలుగులో ఇన్నేళ్ల కెరీర్‌లో 'ఢీ, దేనికైనారెడీ' వంటి ఒకటి రెండు చిత్రాలు తప్ప మంచు విష్ణుకి చెప్పుకోదగ్గ హిట్స్‌లేవు. కానీ ఆయన మాత్రం సినిమాల విషయంలో ఎక్కడా తగ్గడు. ఒక సినిమా తర్వాత మరో సినిమాను మొదలుపెడుతూ గజినీలా దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. ఇక ఆయన ప్రస్తుతం జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో తాను, బ్రహ్మానందం కీలక పాత్రలను పోషిస్తున్న 'ఆచారి అమెరికా యాత్ర' అనే చిత్రం చేస్తున్నాడు. 

ఎంటర్‌టైనర్‌ మూవీగా రూపొందనున్న ఈ చిత్రంలో ప్రగ్యాజైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఆయన ఆమద్య కార్తీక్‌ అనే దర్శకునిగా 'సరదా' అనే చిత్రం ప్రారంబించాడు. తర్వాత ఈ సినిమాని పక్కనపెట్టి తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ద్విభాషా చిత్రంగా ఓ చిత్రం స్టార్ట్‌ చేశాడు. తాజాగా ఈ చిత్రం ప్రీలుక్‌ పోస్టర్‌ని తెలుగు కంటే తమిళంలోనే ముందుగా విడుదల చేశాడు. దీనికి 'కుర్జల్‌ 388' అనే టైటిల్‌ని పెట్టారు. ఈ చిత్రం ప్రీలుక్‌ పోస్టర్‌ని చూస్తుంటే ఇదేదో చారిత్రక నేపధ్యం ఉన్న చిత్రంగా అనిపిస్తోంది. త్వరలో తమిళంలో ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసి, అదే సమయంలో తెలుగులో ప్రీలుక్‌ పోస్టర్‌ని విడుదల చేస్తారని సమాచారం.

ఇక ఇందులో సురభి హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు ఈయన సోదరుడు మంచు మనోజ్‌ కూడా ప్రస్తుతం 'ఒక్కడు మిగలాడు' అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో ఆయన ఎల్టీటీటీఈ నాయకునిగా, విద్యార్ధి నాయకునిగా కనిపించనున్నాడు. ఈచిత్రాన్ని కూడా ఆయన తెలుగుతో పాటు తమిళంలోనే రిలీజ్‌ చేయనున్నాడు. మొత్తానికి ఇలా ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి తెలుగుతో పాటు తమిళంపై కూడా దృష్టి పెట్టడాన్ని విశేషంగా చెప్పాలి. మరి ఈ చిత్రాలైనా వారికి అదృష్టాన్ని తీసుకొస్తాయా? లేదా? అన్నది వేచిచూడాల్సివుంది..!

Manchu Heroes Eye on Kollywood:

Manchu Vishnu Released His Upcoming Movie Press Look in Kollywood

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ