ఈ మధ్య మన దేశంలోని డాక్టర్లు కూడా తమ వృత్తులలో సృజనాత్మకతను బయటికి తీస్తున్నారు. ఆ మద్య బెంగుళూరులో ఓ వ్యక్తి గిటార్ వాయిస్తుండగా శస్త్ర చికిత్స చేశారు. ఇక చెన్నైలో తాజాగా ఓపాప క్యాండీ క్రష్ ఆడుతుండగా, ఆ పాపకు మెదడుకు సర్జరీ చేశారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన ఓ స్టాఫ్ నర్స్‌కి ఫిట్స్ వచ్చాయి.ఆమెను గుంటూరు తీసుకుని వెళ్లి చూపించగా మెదడులో రక్తం గడ్డకట్టిందని దానికి ఆపరేషన్ చేయాలని చెప్పారు.
అయితే ఈ ఆపరేషన్ నిర్వహించినంత సేపు పేషెంట్ మెలకువతోనే ఉండాలి. దాంతో తులసి హాస్పిటల్‌కి చెందిన డాక్టర్లు వినూత్నంగా ఆలోచించి ఆపరేషన్ థియేటర్‌లో 'బాహుబలి' చిత్రాన్ని ప్రదర్శిస్తూ పేషెంట్ ఆ సినిమాను చూస్తూ ఉండగా, ఆపరేషన్‌ని విజయవంతంగా పూర్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఇలా ఆపరేషన్ చేయడం ఇదే మొదటిసారిగా వైద్యనిపుణులు చెబుతున్నారు. మొత్తానికి 'బాహుబలి' మాయ ఇంకా ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంది.