రామ్ చరణ్ హీరోగా దిల్‌రాజు నిర్మాణంలో వంశీపైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన 'ఎవడు' చిత్రం రామ్ చరణ్‌ది మెయిన్ హీరో పాత్రకాగా బన్నీ ఇందులో స్పెషల్ రోల్ చేశాడు.బన్ని ఆ సినిమాలో నటించడం సినిమాకు బాగా ప్లస్ అయిందనే చెప్పాలి.ఇక తాజాగా ప్రస్తుతం బన్నీ స్టార్ రైటర్ వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ 'నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా' చిత్రం చేస్తున్నాడు. దీనికి మెగా బ్రదర్ నాగబాబు కూడా భాగస్వామి, తనతో తీసిన 'ఆరెంజ్' చిత్రంతో తీవ్రంగా నష్టపోయిన నాగబాబును ఆదుకోవడానికి రామ్ చరణ్ సైతం తనవంతు బాధ్యత నెరవేర్చనున్నాడని సమాచారం.
'నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా' చిత్రంలో కథను మలుపుతిప్పే అత్యంత కీలకమైన పాత్రను రామ్ చరణ్ ఓ గెస్ట్ రోల్‌లో పోషించనున్నాడని సమాచారం. ఇక 'దృవ' చిత్రంలో ఐపిఎస్ ఆఫీసర్ పాత్ర కోసం రామ్ చరణ్ సిక్స్‌ప్యాక్ బాడీ సాధించి ఎంతగానో బాడీని బిల్డప్ చేశాడు. దాంతో ఆర్మీ ఆఫీసర్ పాత్రకు కూడా ఆయన గెటప్ బాగా సూట్ అవుతుందని అంటున్నారు. మరోవైపు చరణ్ 'రంగస్థలం 1985' చిత్రం కోసం గుబురుగడ్డం పెంచి ఉన్నాడు.
మరోవైపు మెగాస్టార్ 151వ చిత్రం 'సై..రా... నరసింహారెడ్డి' కోసం అహర్నిశలూ ప్రీపొడక్షన్ వర్క్‌లో ఉన్నాడు. ఈ విధంగా చూసుకుంటే రామ్ చరణ్ పాత్ర చిత్రీకరణ ఇప్పుడే ఉండదని, 'రంగస్థలం 1985' షూటింగ్ పూర్తయి. 'సై..రా' చిత్రం సెట్స్‌పైకి వెళ్లిన తర్వాతే రామ్ చరణ్ పోషించే పాత్ర షూటింగ్ చిత్రీకరణ ఉంటుందని సమాచారం.