బద్రి, జానీ సినిమాలల్లో పవన్ కళ్యాణ్ తో నటించిన రేణు దేశాయ్... ఆ తర్వాత పవన్ తో సహజీవనం చేసి బాబు పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ని కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. పెళ్లి అయ్యాక వారికి మరొక పాప పుట్టింది. అయితే ఇద్దరు పిల్లలున్న పవన్, రేణులు అనుకోకుండా విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. పిల్లలిద్దరి బాధ్యతలతో రేణు దేశాయ్ గడుపుతుండగా.. పవన్ మాత్రం మరో ఆమెతో సహజీవనం కొనసాగిస్తున్నాడు. అప్పుడప్పుడు తన పిల్లల దగ్గరికి వెళ్లి వారి ఆలనాపాలనా చూస్తున్నాడు కూడా పవన్.
ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే కాకుండా స్వాతంత్ర్య మహిళగా కూడా ఎదిగిన రేణు దేశాయ్.. ఇన్నాళ్లకు బులితెరమీద నీతొనే డాన్స్ చేస్తా అనే ప్రోగ్రాం ద్వారా అభిమానులకు దగ్గర కాబోతుంది. ఈ విజయదశమి సందర్భంగా రేణు దేశాయ్ జడ్జ్ గా వస్తున్న ఈ డాన్స్ షో మొదలైంది. ఈ షో ఓపెనింగ్ రోజున రేణు మంచి డాన్స్ పెరఫార్మెన్సు తో తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేసింది. అయితే ఈ షోలో కనబడే ముందు ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రేణు దేశాయ్ ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. అదేమిటంటే రేణు దేశాయ్ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకుంటుందట.
అసలు గతేడాది వరకు మరో పెళ్లి ఆలోచనే రాలేదని చెబుతున్న రేణు ఇప్పుడు మరో పెళ్లి ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా వివరిస్తుంది. అసలు ఏడాది క్రితం వరకు తనకి పెళ్లి ఆలోచనే లేదు అని.... ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు తనకంటూ ఎవరైనా ఉంటే కొంచెం సహాయంగా ఉంటుందని అనిపించిందని చెబుతుంది. అసలు తనని ఆసుపత్రికి తీసుకెళ్లడం కానీ.... తన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడానికి మన అనేవాళ్లు ఎవరైనా ఉంటే బాగుంటుందని అనిపించిందని...... తనకి ఒంట్లో బాగలేకపోతే రెండుమూడు సార్లు ఆమె అక్కవచ్చి ఉదయం 3 గంటల సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలోనే రేణుకి మరో పెళ్లి ఆలోచన వచ్చిందట.
అలాంటి సమయంలోనే రేణు మరో పెళ్లి గురించి ఆలోచన మొదలు పెట్టిందట. నా అనేవాళ్లు ఎవరైనా ఉంటే బాగుంటుందని...... ఆ ఇన్సిడెంట్‌కు ముందు నో మ్యారేజ్.. నో లవ్.. నో రిలేషన్ షిప్.. నోమోర్ అనుకున్నా. కానీ ఒంట్లో బాగాలేనప్పటి నుంచి ఆలోచన మారుతోంది.... అంటూ చెప్పిన రేణు ఆ పెళ్లి రాత రాసిపెడితే అవుతుందని.. ఆ టైం ఎప్పుడొస్తుందో చూద్దామని.. తన మరో పెళ్లి నిర్ణయాన్ని ఆ దేవుడికే వదిలేసింది.