Advertisementt

రామ్ చరణ్ పై అ వార్తలు నిజమే!

Sun 01st Oct 2017 06:19 PM
jr ntr,jai lava kusa,ram charan,jai character,bobby,kona venkat  రామ్ చరణ్ పై అ వార్తలు నిజమే!
Ram Charan Appreciated Jr NTR About Jai రామ్ చరణ్ పై అ వార్తలు నిజమే!
Advertisement
Ads by CJ

గత రెండు రోజులుగా మెగా హీరో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ చిత్రాన్ని వీక్షించాడని.. అలాగే ఎన్టీఆర్ కి ఫోన్ చేసి జై పాత్ర అద్భుతమంటూ రామ్ చరణ్ పొగిడినట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే అది నిజమా? కదా? అనేది పూర్తి క్లారిటీ లేదు. ఎందుకంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ మంచి స్నేహితులైనప్పటికీ... జై లవ కుశ విడుదలై చాలా రోజులు అవ్వడం... అలాగే చరణ్ హైదరాబాద్ లో ఉండి స్నేహితుడి సినిమాని లెట్ గా చూశాడా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే చరణ్ జై లవ కుశాను వీక్షించడం నిజమే.

ఆ విషయం ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోనే దానికి సాక్ష్యం. జై లవ కుశ సినిమాని రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి వీక్షించడమే కాదు ఇద్డు కలిసి బాగా ఎంజాయ్ చేశారనే విషయం మాత్రం ఆ ఫోటోని చూస్తే బాగా అర్ధమవుతుంది. అలాగే ఆ ఫొటోలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హాగ్ చేసుకుని చేతులు చూపిస్తూ ఉంటె పక్కనే ఉన్న కోన వెంకట్ వారి అనుబంధాన్ని తనివి తీరా చూసి మురిసిపోతున్నాడు. అయితే ఆ ఫోటోని పోస్ట్ చేసింది కోన వెంకటేనండోయ్.  ఆ ఫోటో తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కోన వెంకట్.. జై లవ కుశాని చూసిన తర్వాత జై తో కలిసి గ్రేట్ గెస్ట్ రామ్ చరణ్ సెలెబ్రేషన్స్ అంటూ పోస్ట్ చేశాడు.

మరి ఈ పిక్ ని చూస్తుంటే మాత్రం చరణ్, ఎన్టీఆర్ మధ్య స్నేహం ఎంతబావుందో అనుకోకుండా ఉండలేరు. అసలు ముందునుండే వీరు మంచి స్నేహితులు. అదే విషయం బాద్ షా సినిమా పూజ కార్యక్రమాల రోజున రామ్ చరణ్, ఎన్టీఆర్ ని కారులో ఎక్కించుకుని తీసుకొచ్చినప్పుడే అందరికి తెలిసిపోయింది. ఇక ఇప్పుడు ఈ ఫోటోని చూసిన ఎన్టీఆర్ ఫాన్స్, మెగా ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Ram Charan Appreciated Jr NTR About Jai:

Mega power star Ram Charan appreciated Tarak on his recent Jai Lava kusa Movie success. Not just that, he was invited to NTR’s private party and he attended and both the stars spent some time together.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ