మన హీరోయిన్లలో హన్సిక, సుస్మితా సేన్, సన్నిలియోన్ వంటి వారు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక సినిమాలలో తల్లిపాత్ర చేయలంటే వీరికి ఎంతో భయం. ఎందుకంటే కెరీర్ మొదట్లోనే అలా చేసే వారి కెరీర్ దెబ్బతింటుంది. అలాగని ఫేడవుట్ దశకు వచ్చేదాకా వెయిట్ చేయాలంటే వయసు కనీసం 30ఏళ్లు పైబడిపోతుంది. దాంతో మన హీరోలు, హీరోయిన్లు కూడా సరోగసీ లేదా దత్తత మార్గం ద్వారా ఫేమ్‌లో ఉన్నప్పుడే తల్లి ఆప్యాయతను అనుభవిస్తున్నారు.
ఇక హన్సిక ఎంతో మంది పిల్లలను దత్తత తీసుకుని వారి యోగక్షేమాలు చూసుకుంటోంది. సుస్మితాసేన్, సన్నిలియోన్‌లు పిల్లలను దత్తత తీసుకున్నారు. ఇక షారుఖ్‌ఖాన్, అమీర్‌ఖాన్, కరణ్‌జోహార్, మంచు లక్ష్మి వంటి వారు సరోగసి ద్వారా పిల్లలను పొందారు. ఇక సల్మాన్ తన వయసు 50 దాటడంతో నేను మంచి భర్తని కాలేకపోచ్చు కానీ మంచి తండ్రిని అవుతానని చెప్పి సరోగసీ ద్వారా పిల్లలకు తండ్రి అయ్యేందుకు సంసిద్దుడవుతున్నాడు.
ఇక తాజాగా తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ హోదా కోసం కష్టపడుతున్న రెజీనా తాజాగా ఓ పాపను దత్తత తీసుకుంది. జోయెల్లి డానియేల్ అనే ఆడపిల్లను దత్తత తీసుకుంది. బిడ్డను దత్తత తీసుకోవడం, అందునా ఓ అమ్మాయిని దత్తత తీసుకున్న ఆమెపై సెలబ్రిటీలు, నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరి అమ్మగా రెజీనా ఆ పాపకు ఎలాంటి తల్లి ప్రేమను అందిస్తుందో వేచిచూడాల్సివుంది...!