ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై లవ కుశ మిశ్రమ స్పందనతో థియేటర్స్ లో కోట్లు కొల్లగొడుతోంది. స్పైడర్ రాకతో కొద్దిగా డల్ అయిన జై లవ కుశ.... సినిమాతో ఆల్రెడీ ఎన్టీఆర్ 100 కోట్ల క్లబ్బులోకి చేరాడు. అయితే జై లవ కుశ లో జై, లవ, కుశ మూడు పాత్రల్లో కెల్లా జై పాత్రకి విపరీతమైన పేరొచ్చిన విషయం తెలిసిందే. అయితే సినిమా క్లైమాక్స్ లో జై పాత్రని చంపెయ్యడం ఎన్టీఆర్ అభిమానులకే కాదు... ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా పెద్దగా నచ్చలేదు. జై చనిపోకుండా ఉన్నా సినిమా బాగుండేదనే మాట కొంతమంది ప్రేక్షకులు నోటినుండి వచ్చింది. కొంతమందేమో ఆ పాత్ర చనిపోవడమే కరెక్ట్ అంటున్నారు.
అయితే ఎన్టీఆర్ మాత్రం 'జై' పాత్రని నేనే చంపేశాను అంటున్నాడు... ఎలా అంటే దీవార్ ఫిలిం లో క్లైమాక్స్ లో అమితాబచ్చన్ చచ్చిపోవడం నాకు నచ్చలేదు. అంతేకాదు షోలేలో కూడా అమితాబ్ పాత్ర చనిపోవడం కూడా నాకు నచ్చలేదు. కానీ... ఆ సినిమాల్లో ఆ పాత్రలు పడిన మనోవేదనకు చివరికి చనిపోవడమే కరెక్ట్ అనే సమాధానం వచ్చింది. మరి జై లవకుశలో కూడా జై పాత్ర ... చిన్నప్పటి నుండి పడిన మనోవేదన కూడా తక్కువేమి కాదు. అందుకే క్లైమాక్స్ లో జై పాత్రను చంపేద్దామన్న ఐడియా దర్శకుడు బాబీ కి నేనే ఇచ్చాను..... అలా జై పాత్ర చనిపోయినప్పుడే సినిమా పండుతుందని నేను గట్టిగా నమ్మబట్టే ఆ పాత్ర కి అంత పేరొచ్చింది అని ఎన్టీఆర్ చెప్పిన విషయాన్నీ జై లవ కుశ నిర్మాత కళ్యాణ్ రామ్ అందరికి చెప్పేశాడు.
అలా ఎన్టీఆర్ ఇచ్చిన సలహాతోనే జై లవ కుశలో జై పాత్రని చంపేలా తిరిగి కథను ప్రిపేర్ చేశామన్నారు. అసలు జై లవ కుశ సినిమా కథ అనుకున్నప్పుడు అందులో జై పాత్ర చనిపోదు..... ముగ్గురు అన్నదమ్ములు కలిసిపోయే క్లైమాక్స్ మాత్రమే ఉంది. కానీ కథ రొటీన్ గా ఉందని ఎన్టీఆర్ కి అనిపించడంతో.... జై క్యారెక్టర్ లో డెప్త్ తనకు సరిపోలేదన్నాడు. అయితే ఎన్నో రోజులు చర్చించిన తర్వాత జై పాత్రను చంపేద్దామని ఎన్టీఆర్ చెప్పడంతో దానికే డిసైడ్ అయ్యి.... కథలో ఆమేరకు మార్పు చేశామని చెబుతున్నాడు.
అంటే దీన్నిబట్టి కథ మాత్రమే దర్శకుడు బాబీ ది.... కానీ కత్తిలాంటి క్లైమాక్స్ మాత్రం ఎన్టీఆర్ దే అన్నమాట.