శ్రీనువైట్ల.. కొంచెం కొంచెంగా ఎదుగుతూ, 'ఢీ'తో సూపర్‌సక్సెస్‌ని అందుకోవడంతోనే కాదు.. తెలుగులో అలాంటి ఫార్ములాకు ఆద్యం పోశాడు. దాంతో బడా బడా హీరోలు కూడా ఆయనతో చిత్రాలు చేయడానికి లైన్‌లో నిల్చున్నారు. అనుకున్నట్లే ఆయన బ్లాక్‌బస్టర్స్ ఇచ్చాడు. కానీ ఏ క్షణాన ఆయన కోనవెంకట్‌ని పక్కనపెట్టాడో నాటి నుంచి వరుస ఫ్లాప్‌లు అందుకుంటూ ఉన్నారు. కోనవెంకట్‌తో మెగా ఫ్యామిలీ ఒత్తిడి వల్ల చేసిన 'బ్రూస్‌లీ', దానికి ముందు మహేష్‌తో చేసిన 'ఆగడు' అనుకోని వరంగా మెగా హీరో వరుణ్‌తేజ్‌తో 'మిస్టర్' రూపంలో వచ్చిన చాన్స్‌ని ఆయన అందిపుచ్చుకోలేకపోయాడు. నిన్నటివరకు ఆయన కోసం తపించిన నాగచైతన్య, రామ్ వంటి హీరోలు కూడా తప్పించుకుని తిరుగుతున్నారు. ఇక ఆయనకు చివరి చాన్స్ అనే విధంగా రవితేజ, శ్రీనువైట్లతో ఓ చిత్రం చేయనున్నాడని సమాచారం. ఈ చిత్రానికి దర్శకహీరోలు ఇద్దరు పారితోషికం తీసుకోకుండా తాము కేటాయించిన బడ్జెట్‌లోనే తీయాలని మైత్రి మూవీమేకర్స్ సంస్థ కండీషన్ పెట్టిందని, సినిమా హిట్టయి లాభాలు వస్తేనే హీరో దర్శకులకు రెమ్యూనరేషన్ ఇస్తామని మైత్రిమూవీస్ సంస్థ కండీషన్.
ఇక 'మిస్టర్' విషయానికి వస్తే ఇది శ్రీనువైట్ల స్వయంకృతాపరాధమే అంటున్నారు. ఆ చిత్రానికి అంత బడ్జెట్ అవసరం లేకపోయినా విపరీతమైన ఖర్చు పెట్టించాడు. ముందుగానే నిర్మాతలు ప్యాకేజీని మాట్లాడుకుంటే దానిని మించి ఖర్చుపెట్టాడు. ఇప్పటికే ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ వల్ల తన ఇల్లు కూడా అమ్మివేసి కొంత మొత్తం నిర్మాతలకు కట్టిన శ్రీనువైట్ల తాజాగా అప్పు చేసి మరీ 'మిస్టర్' నిర్మాతలకు రూ.85లక్షలు చెల్లించాడట. ఇక గతంలో సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు నిర్మాతలో లేక హీరోలో రెమ్యూనరేషన్ తగ్గించుకునే వారు. కానీ శ్రీనువైట్ల ద్వారా కొత్త పంధాకు తెరలేచిందనే చెప్పాలి. సినిమా ఆడటం ఆడకపోవడం దైవాదీనం. కానీ భారీ ఖర్చుపెట్టించి, రోజుల తరబడి సినిమాలు తీస్తూ, బడ్జెట్ మోపెడుగా తయారుకావడానికి కారణమవుతున్న 'ఆరెంజ్' భాస్కర్, గుణశేఖర్, వైవిఎస్ చౌదరి వంటి వారు ఇలాంటి నిబంధనలతో అయినా నిర్మాతల శ్రేయస్సును పట్టించుకుంటారో లేదో చూడాలి....!