సుమ, ఝాన్సీ, ఉదయభాను, అనసూయ, రేష్మిలకు ధీటుగా వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి, మంచి చలాకితనం, అందం, గ్లామర్‌షో వంటివి చేయడంలో దిట్ట అయిన నటి, యాంకర్ శ్రీముఖి. ఈమె అనతికాలంలోనే బుల్లితెర వీక్షకులను తన యాంకరింగ్‌తో కట్టిపడేస్తూ అందరికీ మంచి పోటీ ఇస్తోంది. ఇక ఈమె వెండితెరపైనా అవకాశాలు సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆమె ప్రస్తుతం 'అమృతం'లో టైటిల్ పాత్రను పోషించి, కొన్ని ఎపిసోడ్స్‌కి కూడా దర్శకత్వం వహించి, 'ఇష్క్, మనం' వంటి చిత్రాలకు రచయితగా పనిచేసిన హర్షవర్దన్ దర్శకత్వంలో 'గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ' సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె పోషించే పాత్ర పల్లెటూరి పాత్రగా, ఆమె లుక్స్ చూస్తుంటే 'స్వర్ణకమలం'లో నటించిన నయనాభినేత్రి భానుప్రియలా ఉంటుందని అనిపిస్తోంది.
ఇక ఈమె తాజాగా భానుప్రియ టైప్‌లోనే చూపులు, మొహం పెట్టి, తాను షూటింగ్ చేయబోయే పాత్ర లుక్ ఇదేనని పోస్ట్ చేసింది. ఈ ఫొటో అచ్చు 'స్వర్ణకమలం'లోని మీనాక్షి పాత్రను పోషించిన భానుప్రియలాగే ఉండటంతో తన ఫోటోను ఆమె ఫోటోకి పక్కనపెడుతూ పోస్ట్ చేసింది. ఇక ప్రస్తుతం టాప్ కమెడియన్‌గా, స్పాంటేనియస్‌గా ఈమద్య సమంతను కూడా ఏడిపించిన వెన్నెల కిషోర్, శ్రీముఖిని ఆటపట్టిస్తూ, ఇంతకీ భానుప్రియగారు మీకు కుడివైపున ఉన్నారా? లేక ఎడమవైపున ఉన్నారా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఎమేజీలను పోస్ట్ చేశాడు. దానికి శ్రీముఖి 'ఛీ..పో..నాకు సిగ్గు' అంటూ ముఖానికి చేతులు అడ్డుపెట్టుకున్న ఎమోజీలను పోస్ట్ చేసింది. వీరిద్దరి మద్య జరిగిన ట్విట్టర్ సంభాషణ నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.