Advertisementt

'స్పైడర్‌' పై రజినీ రియాక్షన్ ఇలా వుంది!

Fri 29th Sep 2017 02:47 PM
spyder,rajinikanth,spyder movie,praises,mahesh babu,murugadoss  'స్పైడర్‌' పై రజినీ రియాక్షన్ ఇలా వుంది!
Super Star Rajinikanth Reaction on Spyder Movie 'స్పైడర్‌' పై రజినీ రియాక్షన్ ఇలా వుంది!
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్‌ మహేష్‌ 'స్పైడర్‌'కి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రశంసలు 

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.ప్రసాద్‌ నిర్మించిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'స్పైడర్‌'. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ సాధించి సూపర్‌హిట్‌ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శింబపడుతోంది. ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రత్యేకంగా వీక్షించారు. 

'స్పైడర్‌' చిత్రం గురించి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మాట్లాడుతూ..సినిమా చాలా బాగుంది. యాక్షన్‌తోపాటు మంచి మెసేజ్‌ కూడా ఈ సినిమాలో వుంది. మురుగదాస్‌ అద్భుతంగా ఈ సబ్జెక్ట్‌ని హ్యాండిల్‌ చేశారు. మహేష్‌బాబు చాలా ఎక్స్‌ట్రార్డినరీగా పెర్‌ఫార్మ్‌ చేశారు. 'స్పైడర్‌'లాంటి మంచి సినిమాని ప్రేక్షకులకు అందించిన యూనిట్‌ సభ్యులందరికీ నా అభినందనలు.. అన్నారు. 

Super Star Rajinikanth Reaction on Spyder Movie :

Rajinikanth Praises Spyder Team

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ