Advertisementt

అర్జున్ రెడ్డితో అబ్బాయ్ కి బాగా పెరిగింది!

Fri 29th Sep 2017 11:46 AM
vijay devarakonda,pelli choopulu,arjun reddy,remuneration  అర్జున్ రెడ్డితో అబ్బాయ్ కి బాగా పెరిగింది!
Vijay Devarakonda Hiked His Remuneration అర్జున్ రెడ్డితో అబ్బాయ్ కి బాగా పెరిగింది!
Advertisement
Ads by CJ

ముందు కొన్ని చిత్రాలలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన విజయ్‌దేవరకొండ 'ఎవడే సుబ్రహ్మణ్యం'తో కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత 'పెళ్లి చూపులు'తో మంచి హిట్‌ కొట్టాడు. కానీ 'అర్జున్‌రెడ్డి' చిత్రంతో మాత్రం ఆయన యూత్‌కి ఐకాన్‌గా మారిపోయాడు. ఓవర్‌నైట్‌ స్టార్‌ రావడంతో షాపింగ్‌ మాల్స్‌ ఓపెనింగ్స్‌, ప్రకటనలు, బ్రాండ్‌ అంబాసిడర్‌గా బిజీ కావడమే కాదు.. వరుసగా తన చిత్రాలను లైన్‌లో పెడుతున్నాడు. ఇక 'అర్జున్‌రెడ్డి' విడుదలకు ముందు వరకు ఆయన కోటి రూపాయలు అడిగే వాడు. కానీ 'అర్జున్‌రెడ్డి' బ్లాక్‌బస్టర్‌ తర్వాత తన పారితోషికాన్ని ఏకంగా రెండింతలు చేశాడు. అంటే ప్రస్తుతం ఆయన సినిమాకి రెండో కోట్లు చొప్పున వసూలు చేస్తున్నాడు. 

ప్రస్తుతం ఆయన గీతాఆర్ట్స్‌లో పరుశురామ్‌ దర్శకత్వంలో ఓ చిత్రంతో పాటు రెండో చిత్రానికి కూడా ఒప్పుకున్నాడు. ఇక మైత్రి మూవీ మేకర్స్‌, అశ్వనీదత్‌ బేనర్‌లో కూడా చిత్రాలు చేయనున్నాడు. కాగా ఈ చిత్రాలన్ని ఆయన ఒప్పుకోక ముందు కోటి రూపాయలే పారితోషికం. కానీ ఆయనతో సినిమాలు తీసే ఏ నిర్మాత కూడా ముందుగా ఆయనతో అగ్రిమెంట్‌ చేసుకోకుండా 'పెళ్లి చూపులు'తో ఏదో గాలి వాటుగా హిట్‌ కొట్టాడా? లేక నిజంగానే దమ్మున్న హీరోనా అని ఆలోచించే క్రమంలో వారందరూ ఆయనతో సినిమాపై మాటా మంతి జరిపినప్పటికీ ముందుగా రెమ్యూనరేషన్‌ విషయంలో అగ్రిమెంట్‌ చేసుకోవడం లేదు. దాంతో మన విజయ్‌ కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి.. అనే రూల్‌ని ఫాలో అవుతున్నాడు. అయినా కూడా ఆయన ఇంటి ముందు దర్శకనిర్మాతలు కాపలా కాస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో అన్నింటికీ సమాధానం కేవలం హిట్టేనని మరోసారి ప్రూవ్‌ అయింది. 

Vijay Devarakonda Hiked His Remuneration:

Vijay Devarakonda Remuneration Doubled

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ