ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌లో రాధాకృష్ణ నిర్మాతగా ఓ చిత్రం చేస్తున్నాడు. తమిళ సెన్సేషనల్ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయం అవుతున్నాడు. ఇక హీరోయిన్లుగా కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుయేల్‌లు నటిస్తున్నారు. పీఎస్‌పీకే 25గా వ్యవహరిస్తున్న ఈచిత్రం కాన్సెప్ట్ పోస్టర్, సాంగ్ ప్రోమోలు ఆమద్య రిలీజై హడావుడి చేశాయి. ఇక ఈ చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ కూడా దసరాకి విడుదలవుతాయని వార్తలు వచ్చాయి. కానీ టైటిల్‌ని ఇంకా ఫైనలైజ్ చేయకపోవడంతో దసరాకి ఈ లుక్, టైటిల్ రావడం లేదని తెలుస్తోంది. కాకపోతే దీపావళికి విడుదలయ్యే అవకాశాలున్నాయని మరోవార్త హల్‌చల్ చేస్తోంది. ఇక ఈ చిత్రం ఫస్ట్‌లుక్, టైటిల్ దసరాకి రావడం లేదని తెలిసిన పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందకుండా ఈ చిత్రంలో ఓ ఐటం సాంగ్‌ని యాంకర్ ఉదయభాను చేస్తోందని వార్తలు రావడం హాట్ టాపిక్‌గా మారింది.
ఉదయభాను గతంలో దాసరి దర్శకత్వంలో వచ్చిన 'కొండవీటి సింహాసనం' చిత్రంతో పాటు శేఖర్‌కమ్ముల- రానాల కాంబినేషన్‌లో వచ్చిన 'లీడర్' చిత్రంలో కూడా ఐటం సాంగ్ చేసింది. అయితే కొంతకాలంగా ఆమె వివాహం చేసుకుని గర్బం దాల్చడంతో బుల్లితెరకు, వెండితెరకు దూరంగా ఉంది. ఇక ఈమె ఆమద్య ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మరి నేడు ఏజ్‌బార్ అయిపోయి ఇద్దరు పిల్లల తల్లిని పవన్, త్రివిక్రమ్‌ల తమ చిత్రంలో ఐటం సాంగ్ అడిగారా? లేదా? అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. ఇక గతంలో వచ్చిన పవన్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల 'అత్తారింటికిదారేది' చిత్రంలో అనసూయని ఐటం సాంగ్ కోసం అడగటం,ఆమె నిరాకరించడం జరిగాయి. మరి ఈసారి కూడా ఉదయభానుని అడిగే ఉంటారని కొందరు అంటుంటే.. పవన్ కోరుకుంటే టాప్ టాప్ వాళ్లే ఐటమ్స్ చేస్తారని, ఉదయభాను కోసం వారు ఆరాటపడే అవకాశమేలేదని మరికొందరు వాదిస్తున్నారు.
ఇక ఈమె తాజాగా మరలా బుల్లితెరపై స్టార్‌మా చానెల్‌లో ప్రసారం కాబోయే ఓ డ్యాన్స్‌షోకి యాంకర్‌గా ఎంపికైంది. అదేసమయంలో ఆమె ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలవడం, ఆ తర్వాత తన పిల్లల బర్త్‌డేకు సినీ ప్రముఖులను ఆహ్వానించి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడం చూస్తుంటే ఆమె రాజకీయంగా, సినిమాలలో మరోసారి వెలగాలని ఆశిస్తోందా? అనే అనుమానం రాకమానదు. అనసూయ, రేష్మి వంటి వారిని కూడా కాదని ఉదయభానుకి ఈ చిత్రంలో ఐటం సాంగ్ ఇచ్చారంటే అది త్రివిక్రమ్‌కి ఉదయభానుతో ఉన్న ప్రత్యేక అనుబంధమే కారణమై ఉంటుందని, లేక బహుశా 'అత్తారింటికిదారేది'లో లాగా ఇద్దరు ముగ్గురు ఐటం భామలు నర్తించే పాటలో ఉదయభాను ఒకతిగా ఉండే అవకాశం ఉంది కానీ ఈ ఫేడవుట్ అయిన భామ చేత పూర్తి స్థాయిలో ఐటం సాంగ్ చేయించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.