ఇటీవల కాలంలో కత్తి మహేష్ పవన్‌పై విమర్శలు చేయడం, పవన్ ఫ్యాన్స్ తిరిగి ఘాటుగా రిప్లై ఇవ్వడం తెలిసిందే. మరి అలాంటిది కత్తి మహేష్, కత్తి కార్తీక పేర్లు విన్నాంగానీ ఈ పవన్ కత్తి మాట వినలేదనే డౌట్ వద్దు. విషయానికి వస్తే బిగ్‌బాస్ సీజన్ 1 విజేత నటుడు శివబాలాజీ తాజాగా తనకు పవన్‌తో ఉన్న అనుబంధాన్ని వివరించాడు. తనకు పవన్‌తో ఏడేళ్ల నుంచి అనుబంధం ఉందని, 'అన్నవరం' సినిమా నుంచి ఆయనతో తన సాన్నిహిత్యం ఉందని చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, పవన్ సాధారణంగా బర్త్‌డేలు చేసుకోరు. కానీ 'కాటమరాయుడు' సెట్లో ఆయన నా పుట్టినరోజుని మాత్రం యూనిట్ మధ్య, నా కుటుంబ సభ్యుల మద్య నిర్వహించారు. అది నాకెంతో ఆనందం వేసింది. నాకు ఆయనంటే ఎంతో ఇష్టం. అందుకే నాడు ఆయనకేదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను. అందునా ఆయన ప్రజా నాయకుడు కావడంతో ఆరోజు ఆయనకు నేను కత్తిని బహూకరించాను.. అని చెప్పుకొచ్చాడు.
ఇక తాజాగా శివబాలాజీ బిగ్ బాస్ మొదటి సీజన్ విజేతగా నిలిచి 50లక్షల ప్రైజ్‌మనీ పొందిన సందర్భంగా పవన్‌కి శివబాలాజీ అంటే ఎంతో ఇష్టమని తెలిసే పవన్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అందరూ ఓటింగ్‌లో శివబాలాజీకి ఓటు వేశారని, అందువల్లే ఆయన పవన్ అభిమానులు పుణ్యానా గెలిచాడని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆయన వ్యతిరేకులు మాత్రం పవన్ ఫ్యాన్స్‌కి అంత సీన్ లేదు. అదే పవన్ ఫ్యాన్స్ శివబాలాజీకి మద్దతు తెలిపి ఉంటే ఆయన ఇంకా ఎక్కువ తేడా ఓట్లతో బిగ్‌బాస్‌లో విన్నర్‌గా నిలిచేవాడని, కాబట్టి అదంతా ట్రాష్ అని అంటున్నారు. సో.. మరోసారి శివబాలాజీ పవన్ నామ జపం చేయడంంతో ఈ వివాదం మరలా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.