దసరా సందర్భంగా బరిలోకి దిగిన దిగుతున్న సినిమాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సెప్టెంబర్ 21 న దసరా సెలవలు ఇవ్వగానే ఎన్టీఆర్ జై లవ కుశ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ జై లవ కుశ మిక్స్డ్ టాక్ తో వారం తిరక్కముందే 100 కోట్ల క్లబ్బుని టచ్ చేసిందని... జై లవ కుశ నిర్మాత కళ్యాణ్ రామ్ ఆఫీషియల్ గా ప్రకటించాడు. ఇక ఈ సినిమా తర్వాతి వరుసలో మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా విడుదలైంది. ఈ బుధవారమే విడుదలైన ఈ చిత్రం 120 కోట్ల భారీ బడ్జెట్ తో ఎన్ వి ప్రసాద్, ఠాగూర్ మధు లు నిర్మించారు. ఈ చిత్రానికి మురుగదాస్ డైరెక్టర్.
మరి స్పైడర్ చిత్రం విడుదలైన మొదటి షోకే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. మరి ప్లాప్ టాక్ తెచ్చుకున్నా ఈ వారాంతంలో స్పైడర్ వసూళ్లు బావుంటాయనే ఆశభావం వ్యక్తం చేస్తున్నారు నిర్మాతలు. స్పైడర్ సినిమా చూసి బయటికొచ్చిన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని మురుగదాస్ తెరకేక్కిన్చాడంటే నమ్మలేకపోతున్నామంటున్నారు. ఇకపోతే ఈ దసరా బరిలో మరో సినిమా విడుదల కావాల్సి ఉంది. శర్వానంద్ - మారుతీ కలయికలో తెరకెక్కిన మహానుభావుడు చిత్రం ఈ దసరాకే అంటే... రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా తక్కువ బడ్జెట్ తో నిర్మించినదే.
మరి ఇప్పుడు అందరి చూపు ఈ మహానుభావుడు మీదే వుంది. ఎప్పుడూ పండక్కి సైలెంట్ గా వచ్చి సరదాగా సూపర్ హిట్ కొట్టుకుంటూ పోతున్న శర్వానంద్ మహానుభావుడుపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. మరి రెండు భారీ బడ్జెట్ సినిమాలు జై లవ్ కుశ మిశ్రమ టాక్ తెచ్చుకోగా... స్పైడర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. మరి శర్వా మహానుభావుడు ఏ టాక్ తెచ్చుకుంటుందో తెలియదు గాని.... ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందంటున్నారు సదరు ప్రేక్షకులు.