Advertisementt

ఎస్వీ రంగారావు తర్వాత ఎన్టీఆరేనంట..!

Thu 28th Sep 2017 01:54 PM
bandla ganesh,jr ntr,jai lava kusa,sv ranga rao  ఎస్వీ రంగారావు తర్వాత ఎన్టీఆరేనంట..!
Bandla Ganesh reaction after Jai Lava Kusa watch ఎస్వీ రంగారావు తర్వాత ఎన్టీఆరేనంట..!
Advertisement
Ads by CJ

బండ్ల గణేష్ ఇండస్ట్రీలోకి కమెడియన్ గా ఎంటర్ అయ్యాక కూడా చాలాకాలం పాటు మామూలు హాస్యనటుడుగానే కొనసాగాడు. కమెడియన్ గా ఓ అనుకున్నంత పేరు ప్రతిష్టలు మాత్రం రాలేదనే చెప్పాలి. అలాంటి కమెడియన్ ఉన్నట్టుండి ఓవర్ నైట్ లో నిర్మాత అవతారమెత్తాడు. ఏ చిన్న సినిమాల నిర్మాతగానో కాదు... బడా సినిమాలను నిర్మిస్తూ బడా నిర్మాత అవతారమన్నమాట. ఇక పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లతో సినిమాలు చేసిన బండ్ల గణేష్ ప్రస్తుతానికి ఎటువంటి సినిమాలు తెరకెక్కించకుండా ఖాళీగా ఉంటున్నాడు.

ఇక అవకాశం వచ్చినప్పుడల్లా బడా హీరోలను పొగుడుతూ కాలక్షేపం చేసే గణేష్.. తాజాగా ఎన్టీఆర్ నటించిన జై లవ కుశ గురించి ట్వీట్ చేసి మరోమారు ఇండస్ట్రీలో టాపిక్ అయ్యాడు. జై లవ కుశ సినిమాని రాత్రే వీక్షించానని... సినిమా చూశాక అసలు నిద్రపట్టలేదుని ఎస్వీ రంగారావు తరువాత ఆ స్థాయిలో నటించిన మా బాద్ షా కు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశాడు. మరి మా బాద్ షా  అన్నాడు అంటే.. బండ్ల, ఎన్టీఆర్ తో బాద్ షా సినిమాని నిర్మించిన విషయం తెలిసిందే.

మరి కాటమరాయుడు సినిమా అప్పుడు పవన్ కళ్యాణ్ ని పొగిడిన బండ్ల.. అప్పట్లో పవన్ అవకాశమిస్తాడేమో అనుకున్నాడు. కానీ అది జరగలేదు. మళ్ళీ ఇప్పుడు జై లవ కుశని అడ్డం పెట్టుకుని ఎన్టీఆర్ ని పొగిడే పని పెట్టుకున్నాడు. మరి ఎన్టీఆర్ ఏమన్నా దయ తలుస్తాడేమో చూడాలి.

Bandla Ganesh reaction after Jai Lava Kusa watch:

Bandla Ganesh Praises  Young Tiger Ntr 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ