జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలతో హిట్ కాంబినేషన్ గా పేరుగాంచిన పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కళ్యాణ్ కలయికలో ఇప్పుడు మూడో చిత్రం రూపుదిద్దుకుంటుంది. PSPK 25 చిత్రం మొదలయ్యి చాలాకాలం అయ్యింది. ఆ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ రాజకీయాల వలన ఆ చిత్రం లెట్ అవుతూ లెట్ అవుతూ దసరాకి విడుదల కావాల్సిన సినిమా కాస్తా వచ్చే సంక్రాంతికి షిఫ్ట్ అయ్యింది. పవన్ 25 వ చిత్రంగా తెరకెక్కుతున్నఈ చిత్రానికి ఇప్పటివరకు టైటిల్ కూడా పెట్టలేదు. కాకపోతే మొన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ఒక కాన్సెప్ట్ పోస్టర్ తోపాటు ఒక సాంగ్ బిట్ ని కూడా వదిలారు.
ఇక టైటిల్ ని సస్పెన్స్ లో పెట్టిన చిత్ర బృందం ఈ దసరా పండక్కి పవన్ కళ్యాణ్ - త్రివిక్రంల సినిమా టైటిల్ ని ప్రకటిస్తారని టాక్ వినబడింది. కానీ ఇప్పుడు దసరాకి ఈ చిత్రం టైటిల్ ని విడుదల చేయట్లేదని సమాచారం అందుతుంది. అసలే దసరాకి పవన్ చిత్ర టైటిల్ విడుదలవుతుంది అని ఎన్నో ఆశలు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు డల్ అయ్యారు. అసలు ఈ చిత్రం యొక్క టైటిల్ ఎప్పుడు ప్రకటిస్తారు అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఇక హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ పక్కన కీర్తి సురేష్, అను ఇమాన్యువల్ లు నటిస్తున్నారు. అలాగే సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూ, ఇంద్రజలు కూడా ముఖ్య పాత్రల్లో కనబడనున్నారు.