'సర్దార్ గబ్బర్ సింగ్' అట్టర్ ప్లాప్ తో దర్శకుడు బాబీకి ఇంకా అవకాశాలు రావని జనాలంతా ఫిక్స్ అయ్యారు. ఇక బాబీ కూడా కథలు రాసుకుంటూ అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. అయితే అనుకోకుండా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు బాబీ చెప్పిన కథ వినడం... ఒకే చెయ్యడం జరిగిపోవడమే కాదు ఆ కథతో సెట్స్ మీదకెళ్ళడం... ఆ సినిమా యమా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకోవడం... విడుదల కావడం జరిగిపోయాయి. ఇక ఆ సినిమా కూడా మిశ్రమ స్పందనతో బాగానే ఆడుతుంది. బాబీ దర్శకత్వానికి పేరు రాకపోయినా సినిమా మాత్రం పర్వాలేదనిపించింది.
అయితే జై లవ కుశ చూసిన మెగా హీరో దర్శకుడు బాబీకి ఫోన్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. ఇక బాబీ తన నెక్స్ట్ హీరో ఎవరు, ఎటువంటి కథ తయారు చేసుకున్నాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నవారికి మెగా హీరో అల్లు అర్జున్, బాబీకి ఆఫర్ ఇచ్చేలా ఉన్నాడనే న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది. నా పేరు సూర్య షూటింగ్ లో భాగంగా ఊటీలో ఉన్న అల్లు అర్జున్.. బాబీకి ఫోన్ కాల్ చేసినట్లుగా వార్తలొస్తున్నాయి. జై లవ కుశ సినిమా తీసిన బాబీని అల్లు అర్జున్ అభినందించినట్లుగా చెబుతున్నారు. ఇక హైదరాబాద్ రాగానే ఒకసారి కలుద్దామని కూడా బాబీ కి అల్లు అర్జున్ చెప్పినట్లుగా చెబుతున్నారు.
మరి ఈ విషయం నిజమా కదా అనేది క్లారిటీ లేదు. అసలు అల్లు అర్జున్, బాబీ కి ఫోన్ చెయ్యడం ఏమిటా అంటున్నారు. మరో పక్క ఎలాగూ అల్లు అర్జున్ కి నా పేరు సూర్య సినిమా తర్వాత ఏ దర్శకుడికి కమిట్ అవ్వకపోవడంతో నిజంగానే అల్లు అర్జున్, బాబీకి ఫోన్ చేశాడేమో అంటున్నారు. ఒకవేళ నిజంగా అల్లు అర్జున్, బాబీకి ఫోన్ చేసినట్లయితే బాబీకి అదృష్టం వరించినట్లే.