Advertisementt

హీరోయిన్ పేరు మార్చుకుంది..గమనించాలి!

Wed 27th Sep 2017 02:45 PM
heroine sadha,sada sayyad,heroine sadha name changed  హీరోయిన్ పేరు మార్చుకుంది..గమనించాలి!
Heroine Sadha Changed Her Name హీరోయిన్ పేరు మార్చుకుంది..గమనించాలి!
Advertisement
Ads by CJ

చాలా మందికి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ మీద బాగా నమ్మకం ఉంటుంది. కొందరు తమ పేరును మార్చుకోవడమో, లేక స్పెల్లింగ్‌లో ఏదైనా అక్షరం తొలగించడమో, లేక మరో అక్షరం కలుపుకోవడమో చేసి అదృష్టం తమను వరిస్తుందనే నమ్మకంతో ఉంటారు. గతంలో అలా పేర్లు మార్చుకున్న వారు ఎందరో ఉన్నారు. లక్ష్మీరాయ్‌ తన పేరును రాయ్‌లక్ష్మీగా మార్చుకుని, మరలా మొదటి పేరునే కంటిన్యూ చేస్తోంది. ఇక తమన్నా తన ఇంగ్లీషు స్పెల్లింగ్‌లో ఓ అక్షరాన్ని తీసివేస్తే, రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఓ అక్షరం కలుపుకుని, చేతికి ఉంగరం తొడుక్కుంది. అయితే ఓ ముస్లిం హీరోయిన్‌ ఇప్పుడు తన పేరును న్యూమరాలజీ ప్రకారం మార్చుకోవడం చర్చనీయాంశం అయింది. ఆమె ఎవరో కాదు 'సదా'. 

తేజ దర్శకత్వంలో వచ్చిన 'జయం'తో వెళ్లవయ్యా.. వెళ్లు అనే డైలాగ్‌ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న సదా తర్వాత కొంతమంది యంగ్‌స్టార్స్‌తో చిత్రాలు చేసింది. కానీ ఏదీ సరిగా ఆడలేదు. చివరకు ఆమెను శంకర్‌ తన 'అపరిచితుడు' చిత్రంలో విక్రమ్‌ సరసన జోడీగా తీసుకున్నాడు. ఈచిత్రం పెద్ద హిట్టయినా శంకర్‌ దర్శకత్వంలో నటించే ఏ హీరోయిన్‌ కూడా ఎక్కువ కాలం హీరోయిన్‌గా కొనసాగలేదనే విషయాన్ని సదా కూడా నిరూపించింది. ఇక ఆ తర్వాత 'చుక్కల్లో చంద్రుడు, ఔనన్నా కాదన్నా' చిత్రాలలో నటించినా కూడా కలిసి రాలేదు. ఈ 33ఏళ్ల చిన్నది ప్రస్తుతం ఢీ డ్యాన్స్‌షో గత సీజన్ కి జడ్జిగా వ్యవహరించింది. ఇక ఈమె తండ్రి డాక్టర్‌ కాగా తల్లి బ్యాంకు ఉద్యోగిని. ఈమె పుట్టింది మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో. ఈ ముస్లిం యువతి వెండితెరపై మరలా మెరవాలని ఆశిస్తోంది. 

ఇటీవలే ఓ వేశ్య పాత్రలో నటించడానికి అంగీకరించింది. ఈ నేపధ్యంలో ఆమె ఓ న్యూమరాలజిస్ట్‌ని సంప్రదించింది. అతని సలహా మేరకు పేరును మార్చుకుంది. ఇంతవరకు సదా, సదాఫ్‌గా ఉన్న స్క్రీన్‌ నేమ్‌ని ఈమె ఇప్పుడు సదా సయ్యద్‌గా స్క్రీన్‌ పేరును మార్చుకుంది. కాగా ఈమె అసలు పూర్తి పేరు సదా మహ్మద్‌ సయ్యద్‌ కావడం విశేషం. తన పేరు మార్పును ఆల్‌రెడీ ఆమె తన పీఆర్వోల ద్వారా మీడియావారికి, దర్శకనిర్మాతలకు తన పేరు మార్పును గమనించాలని సందేశాలు పంపుతోంది. 

Heroine Sadha Changed Her Name:

Heroine Sadha Name changed as Sa

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ