అల్లు అర్జున్ డీజే చిత్రం జూన్ లో విడుదలై మిశ్రమ స్పందనతో కోట్లు కొల్లగొట్టింది అన్నారు. డీజే చిత్రానికి ఫిలిం క్రిటిక్స్ యునానమస్ గా ప్లాప్ రివ్యూ లు ఇచ్చారు. సినిమా పెద్దగా ఏం లేదని వారు తేల్చేశారు. ఇక సినిమా విడుడలయిన మూడో రోజే డీజే సక్సెస్ మీట్ పెట్టి హీరో అల్లు అర్జున్ అసలు క్రిటిక్స్ కి ఏం తెలుసనీ నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. వారు నెగెటివ్ రివ్యూలు ఇచ్చినా దువ్వాడ జగన్నాధం హిట్ అయ్యిందంటూ ఢంకా భజాయించాడు. అసలు రివ్యూలు సినిమా కలెక్షన్స్ మీద ప్రభావం చూపుతున్నాయంటూ ఆవేశపడ్డాడు. ఇక డీజే దర్శకుడు హరీష్ అయితే రివ్యూ రైటర్స్ ని ఏకంగా తిట్టిపోశాడు.
ఆ తర్వాత తమిళంలో హీరోగా కన్నా నడిగర్ సంఘం ఎన్నికలప్పుడు, నిర్మాతల మండలి ఎన్నికల్లో హైలెట్ అయిన విశాల్ ప్రతి విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నాడు. అయితే సినిమాల హిట్టా ఫట్టా అని తేల్చేది క్రిటిక్స్ కాదని... ఎంతో కష్టపడి సినిమా తీస్తుంటే మొదటి షో పూర్తవ్వగానే సినిమాలో విషయం వున్నది లేనిది రివ్యూ లో చూపించేస్తున్నారని...అసలు సినిమా విడుదలయ్యాక మూడు రోజుల వరకు ఫిలిం క్రిటిక్స్ రివ్యూ ఇవ్వకూడదాని రెచ్చిపోయి మాట్లాడాడు. కానీ విశాల్ చెప్పిన విషయాన్ని ఎవరు పట్టించుకోలేదు.. అది వేరే విషయం.
ఇక ఇప్పుడు తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ విశ్లేషకుల గురించి మాట్లాడాడు. జై లవ కుశ జయోత్సవ వేడుకలో సినిమా విశ్లేషకులు దారిన పోయే దానయ్యలంటూ కామెంట్ చేశాడు. సినిమా విడుదలవుతుందంటే అదొక పేషేంట్ కింద లెక్కని... ఐసియు లో ఉన్న పేషేంట్ కి ఏమవుతుందో అని బంధువులు కంగారు పడుతుంటే అటుగా దానయ్యలు మాత్రం పేషేంట్ పరిస్థితి బాగోలేదు... అసలు పోయినట్లే అంటూ చెప్పేస్తారని అంటున్నాడు. అసలెప్పుడు సినిమా క్రిటిక్స్ గురుంచి నోరు జారని ఎన్టీఆర్ ఇలా అనడం మాత్రం చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే జై లవ కుశ లో ఎన్టీఆర్ జై నటనకు విమర్శకులు సైతం బ్రహ్మ రధం పట్టారు. కానీ దర్శకుడు లోపం వలన సినిమా బాగోలేదన్నారు కానీ... ఎన్టీఆర్ ని విమర్శించిన వారే లేరు. అలాగే ఎన్టీఆర్... సినిమాల విజయాన్ని దారినపోయే దానయ్యలు నిర్ణయించారని.... ప్రేక్షకులకు నచ్చితేనే సినిమా ఆడుతుందని... అలాగే సినిమా విడుదలైన వెంటనే సినిమాకి రివ్యూ లు ఇవ్వకుండా మూడు రోజుల వరకు ఆగితే బావుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
మరి పైన చెప్పిన ముగ్గురు హీరోల బాధ ఒక్కటే. సినిమా హిట్టనేది ప్రేక్షకుల నిర్ణయమని.... క్రిటిక్స్ విర్ణయం కాదంటున్నారు. మరి కొన్ని సినిమాలకు క్రిటిక్స్ ఇచ్చే పాజిటివ్ రేటింగ్స్ అప్పుడు లేవని నోరు... సినిమా కాస్త నెగెటివ్ రేటింగ్స్ రావడం... క్రిటిక్స్ బాగోలేదని... ఉన్నది ఉన్నప్పుడు చెప్పినప్పుడే నోర్లు లేస్తున్నాయి. ఏదిఏమైనా ఎప్పుడూ ఆచి తూచి మాట్లాడే ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంలో అనవసరంగా నోరు జారడా? అనిపిస్తుంది.