Advertisementt

ఇది నిజమైతే... అనసూయ అందరికీ అత్తే..!

Tue 26th Sep 2017 05:56 PM
anasuya,rangasthalam 1985,aunty role,ram charan,actress anasuya  ఇది నిజమైతే... అనసూయ అందరికీ అత్తే..!
Anasuya Role in Rangasthalam 1985 Movie ఇది నిజమైతే... అనసూయ అందరికీ అత్తే..!
Advertisement
Ads by CJ

యాంకర్ అనసూయ వెండితెర మీద వెలిగిపోవాలనే కలలు కొద్దికొద్దిగా సాకారం అవుతూనే వున్నాయి. మెల్లగా వెండితెర మీద తనకంటూ ప్రత్యకమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి తహతహ లాడుతుంది. బుల్లితెర మీద హాటెస్ట్ యాంకర్ గా పేరు మోసిన అనసూయకి నిజంగా ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఎవరు నమ్మరు. అంతలా ఆమె అందాన్ని మెయింటింగ్ చేస్తుంది. ఏ డ్రెస్ ఆయినా... పొట్టి గౌన్ వేసినా, లంగావోణీ వేసినా, చీర కట్టినా ఏ డ్రెస్సులోనైనా అనసూయ అందాలు అంతలా మెరిసిపోతాయనేది జగమెరిగిన సత్యం. అనసూయ బుల్లితెర మీద టాలెంట్ చూపుతూనే వెండితెర మీద హీరోయిన్ గా వెలిగిపోవానుకుందో ఏమో రకరకాల హాట్ ఫోటో షూట్స్ తో అదరగొట్టింది.

అయితే క్షణం వంటి సినిమాలో అనసూయ కీలక పాత్రలో మెప్పించినా... తర్వాత ఓ... అనుకున్న పాత్రలు రాకపోయేసరికి సాయి ధరమ్ తేజ్ విన్నర్ లో ఓ ఐటెం సాంగ్ చేసి మెప్పించింది. కానీ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యేసరికి అనసూయ పాట హైలెట్ కాకుండా పోయింది. ఇక కథను మలుపు తిప్పే కీలకపాత్ర అయినా సరే చేస్తానంటూ బయలుదేరింది. సుకుమార్ - రామ్ చరణ్ కలయికలో వస్తున్న రంగస్థలం చిత్రంలో అనసూయ స్పెషల్ రోల్... కాదు కాదు ఐటెం సాంగ్ అంటూ ప్రచారం జరిగింది. అయితే రంగస్థలంలో అనసూయ పెళ్ళైన అమ్మాయిలా కనబడుతుందనేది ఆమె విడుదల చేసిన హాఫ్ లుక్ లో అర్ధమయ్యింది.

అయితే అనసూయ, రామ్ చరణ్ రంగస్థలంలో ఏ పాత్ర చేస్తుందో అంటూ తెగ ఆరాటపడిన వారికి ఇప్పుడొక న్యూస్ షాక్ ఇస్తుంది. అదేమిటంటే రంగస్థలంలో షాకింగ్ పాత్ర... అంటే  అనసూయ, రామ్ చరణ్ కి మేనత్తగా కొత్తగా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.  అలాగే పక్కా పల్లెటూరి పడుచులా అనసూయ పాత్ర ఉండబోతుందట. మరి అనసూయకి ఆ పాత్ర ఎంత నచ్చకపోతే రామ్ చరణ్ కి మేనత్తగా నటిస్తుంది అంటున్నారు. అయినా అంత అందమైన భామ మేనత్త ఏమిటండి అంటున్నారు కొందరు. చూద్దాం ఫైనల్ గా అనసూయ రంగస్థలం లో ఎలా కనబడబోతుందో...!

Anasuya Role in Rangasthalam 1985 Movie:

Anasuya  acts Aunty Role in Ram Charan Rangasthalam 1985

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ