బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మించిన జై లవ కుశ చిత్రం గత గురువారమే విడుదలైంది. 100 కోట్ల పైమేర బిజినెస్ చేసిన ఈ చిత్రం ఆ ఫిగర్ రాబడుతుంది అంటే సందేహమే అంటున్నారు. ఈ మధ్యలో జై లవ కుశ జయోత్సవాన్ని నిర్వహించింది చిత్ర బృందం. ఈ జయోత్సవ వేడుకలో ఎన్టీఆర్ తోపాటు అన్న కళ్యాణ్ రామ్, దర్శకుడు బాబీ, కోన వెంకట్, దిల్ రాజు హాజరయ్యారు. ఇక్కడ జై లవ కుశ జయోత్సవ వేడుక కొంచెం హాట్ గానే నడిచింది. అయితే ఎన్టీఆర్ గట్టిగా ప్రిపేర్ అయ్యి వచ్చి అందరిని ఆడుకోవాలనుకున్నాడేమో తెలియదు గాని.... ఎన్టీఆర్ మాత్రం సినిమా విశ్లేషకులను మాత్రం విమర్శించేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు.
జై లవ కుశ విజయం పట్ల హ్యాపీ గా ఉన్నామని... పోసాని గారి నటనను మెచ్చుకుంటూనే... సినిమా పరిశ్రమలో విడుదలయ్యే సినిమా ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులోని పేషెంట్ లాంటిదనీ..... చావు బతుకుల్లో ఉన్న పేషెంట్‌ని మాటలతో చంపేసినట్లే.. సినిమాని చంపేసే ప్రక్రియ సినీ పరిశ్రమలో మొదలయ్యిందనీ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలో సినీ విమర్శకులు దారిన పోయే దానయ్యలని.... వారు సినిమా గురించి విమర్శిస్తే ఏమిటి... ప్రేక్షకుల అభిమానం ఉంటే చాలదా... ఆ సినిమా ఆడడానికి అంటూ స్పీచ్ ఇచ్చాడు. మరి ఎన్టీఆర్ అలా సినీ విమర్శకుల గురించి మాట్లాడడం అంటే జై లవ కుశ కు రివ్యూ రైటర్స్ ఇచ్చిన రేటింగ్ సరిపోలేదా? అసలే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ అంతలా అన్నాడు. అయినా రివ్యూ రైటర్స్ సినిమాలో దమ్ము ఉందంటే ఉందని రాస్తారు. లేదు అంటే లేదని రాస్తారు అది వారి తప్పు కాదు కదా.
అయినా ఎన్టీఆర్ ఈ మధ్యన మీడియాతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలా సహనంతో.. ఎంతో తెలివిగా వ్యవహరిస్తున్నాడు. కానీ ఇప్పుడు జై లవ కుశ సినిమా గురించి ఉన్నది ఉన్నట్టు రాస్తే విమర్శకులను దారిన పోయే దానయ్యలు అంటున్నాడు. కొందరు విమర్శకులు మాత్రమే తనని హార్ట్ చేసినట్లు మాట్లాడి ఎన్టీఆర్ ఆ కొందరికే టార్గెట్ అయ్యాడేమో. అయినా అంతలా ఎన్టీఆర్ కి అసహనం రావడానికి కారణం మాత్రం సొంత బ్యానర్ లో తన అన్న కళ్యాణ్ రామ్ జై లవ కుశ ని నిర్మించడమే. మరి ఆ సినిమాతో కళ్యాణ్ రామ్ కూడా మంచి లాభాలే మూటగట్టుకున్నాడు. అయితే ఎన్టీఆర్ ఆవేదనలోను ఒక కారణం ఉంది. ఎలా అంటే ఎన్టీఆర్ - కొరటాల కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్ కి కూడా క్రిటిక్స్ తీసివేసే రివ్యూ లు ఇచ్చినప్పటికీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి.... ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే.