అక్కినేని ఫ్యామిలిలో నాగార్జున, అఖిల్, సమంతలు ఒక వస్త్ర దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కళ్యాణ్ జువెలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వున్న నాగ్ సౌతిండియా షాపింగ్ మాల్ కి ప్రచార కర్తగా వున్నారు. ఇక అఖిల్, సమంతలు సౌతిండియా షాపింగ్ మాల్ కి ప్రచార కర్తలుగా అనేక షోరూం ఓపెనింగ్స్ కి వెళుతున్నారు. మరి ప్రచారకర్తలు అంటే ఆ బ్రాండ్ ని బాగా ప్రమోట్ చెయ్యాల్సి ఉంటుంది కదా. అందుకే నాగార్జున, అఖిల్ లు సౌతిండియా షాపింగ్ మాల్ రూపొందించిన యాడ్ లో ఇరగదీస్తున్నారు. ఇక ఈ యాడ్ లో నాగ్ తన చిన్న కొడుకు అఖిల్ ని డామినేట్ చేసేస్తున్నాడు అందంలో.
సౌతిండియా షాపింగ్ మాల్ రూపొందించిన ఈ యాడ్ లో అఖిల్ విజిల్ వేసుకుంటూ చాలా స్టైలిష్ గా కొత్త షర్ట్ తో రెడీ అయ్యి హుషారుగా బై నాన్నా అని నాగార్జునకి చెప్పి బయటికి వెళుతుంటే.... అక్కడే కూర్చుని బుక్ చదువుకుంటున్న నాగ్... ఏరా అఖిల్ కొత్త గర్ల్ ఫ్రెండా... అని అడగగా దానికి అఖిల్ అరె మీకెలా తెలిసింది అంటాడు. దానికి నాగ్ సింపుల్ మిస్టర్ అఖిల్... చెవులకి మంచి రొమాంటిక్ సాంగ్ వినబడుతుంది అంటూనే..... నైస్ పెర్ఫ్యూమ్ అంటూ కళ్ళకేమో కొత్త ఫాంటు, కొత్త షర్ట్ కనబడుతుంది.... ఏంటి సౌతిండియా షాపింగ్ మాలా లుకింగ్ గుడ్ అంటే దానికి అఖిల్ మీరు కేక నాన్నా అని బయటికి వెళ్ళిపోతాడు. ఇక అఖిల్ కూర్చుని షూస్ లేస్ కట్టుకుంటుండగా నాగార్జున సౌతిండియా షాపింగ్ మాల్ బ్యాగ్ తో నడిచొస్తుంటే.... అఖిల్, నాగ్ ను ఉద్దేశించి ఏంటి కొత్త గర్ల్ ఫ్రెండా అని చమత్కరించగా... దానికి నాగ్ అటు ఇటు చూసి నాకున్నది ఒకటే గర్ల్ ఫ్రెండ్ రా ఈ డ్రెస్ నీకోసమే అంటూ అఖిల్ చేతిలో ఆ బ్యాగ్ పెట్టేస్తాడు.
మరి ఈ యాడ్ లో తండ్రి కొడుకులు ఇరగదీశారు. నిజంగానే నాగార్జున, అఖిల్ తో అందంలో పోటీ పడ్డాడు. ఇద్దరూ ఈ సౌతిండియా షాపింగ్ మాల్ యాడ్ లో మాత్రం చూడముచ్చటగా కనబడుతున్నారు. ఇకపోతే నాగ్ కుటుంబం మొత్తం ఇప్పుడు నాగ చైతన్య - సమంతల పెళ్లి కోసం గోవా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.