పవన్ కళ్యాణ్ గురించి ఒక న్యూస్ ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఆ న్యూస్ అలాంటి ఇలాంటి న్యూస్ కాదు. అదేమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలగడం. అసలు పవన్ అలగడం ఏమిటా అనుకుంటున్నారా! విషయంలోకి వస్తే ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి కూతురు రచన పెళ్లి శంషాబాద్ లోని ఒక ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ పెళ్ళికి అటు మీడియా ప్రతినిధులు, ఇటు పొలిటికల్ లీడర్స్ చాలామందే హాజరయ్యారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్ జగన్, చిరంజీవి, రేవంత్ రెడ్డి, సుబ్బరామిరెడ్డి, జనసేనాని పవన్ కళ్యాణ్ వంటి వారు ఈ పెళ్ళికి హాజరయిన వారిలో ఉన్నారు.
అలాగే టీవీ 9 రవి ప్రకాష్, ఆంధ్ర జ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ వంటి మీడియా ప్రముఖులు హాజరయిన ఈ పెళ్లిలోనే పవన్ కళ్యాణ్ అలిగాడట. అయితే పవన్ కళ్యాణ్ ఈ పెళ్ళికి వెళ్లినా కూడా లోపలికి వెళ్లకుండానే కారులో నుండి కారులోనే వెనుదిరిగి వెళ్ళిపోయాడట. ఇంతకీ విషయమేమిటంటే పవన్ కళ్యాణ్ వస్తున్నాడని.... ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి, కుటుంబ సభ్యలు పవన్ ని సాదర స్వాగతంతో ఆహ్వానించడానికి వెళ్లే సమయానికి తెలంగాణ సీఎం కేసీఆర్ రావడంతో.... కేసీఆర్ కారు దిగే ముందు అక్కడ వున్న కాన్వాయ్ లను క్లియర్ చేసే క్రమంలో సీఎం సెక్యూరిటీ పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ని కూడా పక్కకి పంపడంతో ఒళ్ళుమండిన పవన్ సీఎం వస్తే తనని ఆపుతారా అని కోపగించుకుని కారు దిగకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయాడట.
అయితే ఆ తర్వాత పవన్ ని బ్రతిమిలాడి తీసుకొద్దామనుకున్న నరేంద్ర చౌదరికి అవకాశం ఇవ్వకుండా పవన్ అక్కడ నుండి వెళ్ళిపోయాడట. మరి పవన్ వస్తున్నాడన్నారుగా.. ఎక్కడ అని అడగగా నరేంద్ర చౌదరి ఏం సమాధానం ఇవ్వలేక గమ్మునుండిపోయారట. దీంతో.. మరీ ఇంత అసహనం అయితే ఎలా.. బాబు పవన్ అంటున్నారు.