బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో దీపికా పదుకొనె లీడ్ రోల్ లో నటిస్తున్న పద్మావతి చిత్రం షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. దీపికా పదుకొనె పద్మావతి గా కనబడనున్న ఈ చిత్రంలో దీపికా బాయ్ ఫ్రెండ్ రణ్వీర్ సింగ్ నెగెటివ్ రోల్ లో కనబడనున్నాడు. పద్మావతిగా దీపికా పదుకొనె లుక్ తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. ఆ లుక్ లో దీపికా రాచరికపు రాణి పద్మావతిలా ఇరగదీసేసింది.
అయితే పద్మావతి చిత్రానికి మొదటి నుండి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. పద్మావతి సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన మొదట్లోనే పద్మావతి చిత్ర దర్శకుడు సంజయ్ లాలీ బన్సాలి మీద దాడి జరగడం... ఆ దాడి కూడా రాజ్‌పుత్ వర్గీయులు చేసినదే అని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు దీపికా... పద్మావతి మరోసారి చిక్కుల్లో పడింది. పద్మావతి చిత్రంలో రణ్వీర్ సింగ్ అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర చేస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీ రూపొందించిన తీరు పట్ల శ్రీ రాజ్‌పుత్ కర్ణి సేన సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకుముందు ఒక థియేటర్ దగ్గర పద్మావతి పోస్టర్ ని తగలబెట్టినప్పుడే.... ఈ సినిమా దర్శకుడు సంజయ్, పద్మావతి విడుదలకు ముందే.... తమ సామాజిక వర్గానికి, చరిత్రకారులకు చూపుతానని ఆయన హామీ ఇచ్చాడని... కానీ ఇంతవరకు అటువంటి ప్రయత్నమేమి సంజయ్ చెయ్యలేదనేది వారి ప్రధాన ఆరోపణ. అంతేకాకుండా రాణి పద్మావతి జీవిత చరిత్రను వక్రీకరించేలా ఇందులో ఆమె పాత్రను మలిచారని.. అందుకే సినిమా పూర్తయ్యాక తాము సినిమా చూసిన తర్వాతే సంజయ్ లీలా బన్సాలి పద్మావతి సినిమాని విడుదల చేయాలనీ.... లేదంటే అసలు పద్మావతి సినిమాని తాము విడుదల కానివ్వమని హెచ్చరిస్తున్నారు. మరి ఫైనల్ గా సంజయ్ వీరికి ఎలాంటి వివరణ ఇస్తాడో చూద్దాం.