ఈ దసరా బరిలో రెండు పెద్ద సినిమాలు ఒక చిన్న సినిమా బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే జై లవ కుశ విడుదలకాగా... స్పైడర్, మహానుభావుడు సినిమాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. పోటీ మొత్తం ఎన్టీఆర్, మహేష్ మధ్య అనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సినిమా విడుదల కాగా.. ఆ రికార్డుల్ని బద్దలుకొట్టేందుకు మహేష్ కూడా స్పైడర్ సినిమాతో శరవేగంగా దూసుకొస్తున్నాడు. ఇందులో భాగంగా విడుదలకు ముందే ఎన్టీఆర్ సృష్టించిన ఓ రికార్డును మహేష్ బాబు బద్దలు కొట్టాడు.
జైలవకుశ విడుదలకు ముందే ప్రీమియర్స్ ఓవర్సీస్ లో గ్రాండ్ గా జరిగాయి. ఒక్క అమెరికాలోనే 189 లొకేషన్లలో జై లవకుశ ప్రీమియర్స్ పడ్డాయి. ఇక ఆ ప్రీమియర్స్ ద్వారా జై లవ కుశ మూడున్నర కోట్లు కూడా కొల్లగొట్టింది. అయితే జై లవ కుశకు 189 లొకేషన్లలో ప్రీమియర్స్ పడితే.... స్పైడర్ కోసం అమెరికాలో ఏకంగా మూడు వందల లొకేషన్లను ఫిక్స్ చేశారు. మరి ఇక్కడే జై లవ కుశ రికార్డును మహేష్ స్పైడర్ తో అధిగమించాడు. ఈ లొకేషన్లలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ కూడా ప్రారంభమైంది. 90 శాతానికి పైగా టిక్కెట్లు కూడా అమ్ముడుపోయాయి. అంతేకాదు.. విడుదలనాటికి మరో 60 లొకేషన్లలో ప్రీమియర్స్ పెరుగుతాయని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. అలా విడుదలకు ముందే ప్రీమియర్స్ లో ఎన్టీఆర్ ను క్రాస్ చేశాడు మహేష్.
అసలు మామూలుగానే... ఎన్టీఆర్ తో పోలిస్తే మహేష్ కు ఓవర్సీస్ లో క్రేజ్ ఎక్కువ. అట్టర్ ఫ్లాప్ అయిన మహేష్ వన్ నేనొక్కడినే సినిమాకే ఓవర్సీస్ లో మంచి వసూళ్లు వచ్చాయంటే మహేష్ పాపులారిటీ ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఇక స్పైడర్ సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. వసూళ్లు ఇరక్కొట్టేయడం ఖాయం అంటున్నారు.