నటన అనేది మనిషి అయితే దానికి ప్రాణం మా జూనియర్ తారక రాముడు. జై లవ కుశ లో అమోఘం. జై ఒక అద్భుతం. ఇంకెన్నో శిఖరాలని అందుకోవాలని కోరుకుంటున్నాను అంటూ కె రాఘవేంద్ర రావు గారు జై లవ కుశ చిత్రం చూసిన తర్వాత స్పందన ఇది. అలాగే దర్శకధీరుడు రాజమౌళి కూడా జయహో జై.. జై.... నాగుండెల్లో ఎప్పటికి నిలిచిపోతావ్ తారక్ అంటూ ఎంతో అభిమానంతో ట్వీట్ చేశాడు. వీరు మాత్రమే కాదు చాలామంది సెలబ్రిటీస్ జై లవ కుశ సినిమా చూసిన తర్వాత తమ స్పందనను ఇలా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. జై లవ కుశలోని జై పాత్రని వారంతా పొగిడేస్తున్నారు.
ఇక తొలిసారి త్రిపాత్రాభినయంతో అదరహో అనిపించిన ఎన్టీఆర్ తన నటనను, జై లవ కుశ విజయాన్ని పొగుడుతున్న అందరికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఎన్టీఆర్ సోషల్ మీడియాలో జై లవకుశ సినిమాపై మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలు చూస్తుంటే నాకు ఎంతో సంతృప్తి కలుగుతోంది. నేను ఒక నటుడిగా మీ నుంచి ఇంతకంటే ఇంకేం కోరగలను. ఇక జై లవకుశ చిత్ర బృందం తరపున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు... అంటూ జై లవకుశ సినిమా విడుదల తర్వాత తొలి ట్వీట్ చేశాడు ఎన్టీఆర్.
ఇక జై లవ కుశ విడుదలైన అన్నిచోట్లా మిశ్రమ స్పందనతో దూసుకుపోతూ రికార్డు కలెక్షన్స్ కొల్లగొడుతుంది. మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా జై లవ కుశ 30 కోట్లు కొల్లగొట్టి అదరహో అనిపించింది.